Begin typing your search above and press return to search.

ష‌ర్మిల టీం కొత్త ఆట మొద‌లు పెట్టిన‌ట్టేనా...?

తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. షర్మిల ఇచ్చిన జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

By:  Tupaki Desk   |   8 Sep 2024 3:30 PM GMT
ష‌ర్మిల టీం కొత్త ఆట మొద‌లు పెట్టిన‌ట్టేనా...?
X

షర్మిల అనుకున్నది సాధించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన ష‌ర్మల తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు జగన్ను అధికారం నుంచి దింప‌డం లక్ష్యంగా ఆమె తీవ్ర ప్రయత్నాలు చేశారు. విస్తృత స్థాయిలో ప్రచారం చేసి జగన్కు బలమైన రెడ్డి సామాజిక వర్గం ఓట్లను దూరం చేయ‌డంలో సక్సెస్ అయ్యారు. తాను గెలిచినా గెలవకపోయినా జగన్ అధికారం నుంచి దింపాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగారు.

షర్మిల ఈ విషయంలో పూర్తిగా విజయం దక్కించుకున్నారు. 150 స్థానాలు ఉన్న వైసీపీని 11 స్థానాలకు ప్రమితం చేయడం వెనుక షర్మిల హస్తం కూడా ఉంది. ఇక ఇప్పుడు ఆమె పట్టుబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నాయకులను ఎంపిక చేసుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ద‌న్నుగా ఉన్న ర‌ఘువీరా రెడ్డి, సాకే శైలజనాథ్, పల్లంరాజు అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రులకు కూడా ఆమె షాక్ ఇచ్చారు.

తనవారిని తన మాట వినే వారిని ఎన్నికల సమయంలో తాను చెప్పినట్టు విని పార్టీలు మారి బయటికి వచ్చిన వారిని ఆమె ఇప్పుడు తన టీంలో చేర్చుకున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. షర్మిల ఇచ్చిన జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలు, నగర స్థాయిలో అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసింది. ఈ మొత్తం కమిటీ సభ్యులను గమనిస్తే నరహరిశెట్టి నరసింహారావు ఆమంచి కృష్ణమోహన్ సహా అనేకమంది గతంలో వైఎస్ కు అనుకూలంగా ఉండి ఆయనను సమర్థించిన వారు.

అదేవిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో షర్మిల చెప్పినట్టు విన్నవారే ఎక్కువ మంది ఉన్నా రు. అంటే, ఒక రకంగా షర్మిల బృందాన్ని బలంగా ఏర్పాటు చేసుకున్నారని చెప్పాలి. ఇక‌, ఇప్పుడు తన బృందంతో ఆమె దూకుడు రాజకీయాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఈ జాబితాపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేక తర్జన భ‌ర్జ‌న పడింది. చాలా మందిని మారుస్తారని షర్మిల టీంలో మార్పులు తప్పవని ఎక్కువమంది భావించారు.

ముఖ్యంగా ఎన్నికలకు ముందు బలంగా ప్రచారం చేసిన సాకే శైలజనాథ్, రఘువీరారెడ్డి వంటి వారికి కీలక ప‌ద‌వులు దక్కుతాయని కూడా అనుకున్నారు. కానీ చివరకు షర్మిల తన పట్టును నిలబెట్టుకు న్నారు. దీంతో అధిష్టానం కూడా కాద‌న‌ లేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఏ విధంగా ముందుకు సాగుతారనే చూడాలి. జగన్ ని టార్గెట్ చేసుకుంటారా? లేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తారా? అనేది చూడాలి.