Begin typing your search above and press return to search.

ష‌ర్మిల‌ దూకుడుతో చేటు... వైసీపీ గ్రాఫ్ మ‌రింత పెరుగుతుందా...!

రాజ‌కీయాల్లో వేసే అడుగులు స్థిమితంగా ఉండాలి. మ‌రీ ముఖ్యంగా.. వైసీపీ వంటి.. ప్ర‌జల్లో సానుభూతిని గెయిన్ చేసుకున్న పార్టీల విష‌యంలో అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి.

By:  Tupaki Desk   |   23 Jan 2024 4:07 AM GMT
ష‌ర్మిల‌ దూకుడుతో చేటు...  వైసీపీ గ్రాఫ్ మ‌రింత పెరుగుతుందా...!
X

రాజ‌కీయాల్లో వేసే అడుగులు స్థిమితంగా ఉండాలి. మ‌రీ ముఖ్యంగా.. వైసీపీ వంటి.. ప్ర‌జల్లో సానుభూతిని గెయిన్ చేసుకున్న పార్టీల విష‌యంలో అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఈ రెండు విష‌యాల‌ను విస్మ‌రిస్తే.. అది ఎంత‌టి పార్టీ అయినా.. బోల్తా ప‌డ‌డం.. నాయ‌కులు ఎంత‌టి వారైనా.. కింద ప‌డడం ఖాయ‌మ‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏపీ ప‌గ్గాలు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల‌.. ``భ‌య‌ప‌డుతున్నారా.. సార్‌!`` అని జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల వైర‌ల్ అయింది.

ఇది.. సాధార‌ణంగా కాంగ్రెస్‌కు, ష‌ర్మిల‌కు కూడాప్ల‌స్ కావాలి. కానీ, ఈ కామెంట్‌పై నెటిజ‌న్ల నుంచి సోష‌ల్ మీడియా జ‌నాల వ‌ర‌కు... సాధార‌ణ పౌరుల దాకా.. వ్యంగ్యాస్త్రాలు ఎదుర‌య్యాయి. భ‌యం అనేది జ‌గ‌న్‌కు తెలియ‌ద‌ని ఆయ‌న అభిమానులు పేర్కొన్నారు. ఇక‌, సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా..``ఆయ‌న‌కెందుకు భ‌యం ``అనే వ్యాఖ్యానించారు. అంటే.. తొలి అడుగులోనే ష‌ర్మిల త‌ప్ప‌ట‌గుడు వేసిన‌ట్టు అయింద‌ని అంటు న్నారు. దూకుడు మంచిదే అయినా.. రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుం ది.

కానీ, ష‌ర్మిల దూకుడు మాత్రం ఒకే వైపు చూస్తున్న‌ట్టుగా ఉందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. గుడ్డిగా దేన్నీ అనుక‌రించ‌క‌పోవ‌డ‌మే రాజ‌కీయం అంటారు.. కానీ, ష‌ర్మిల మాత్రం.. జ‌గ‌న్ ను వ్య‌తిరేకించ‌డ‌మే రాజ‌కీయం అన్న పాఠాలు ఒంట‌బ‌ట్టించుకుని ఏపీలోకి అడుగులు వేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకే వ‌చ్చీ రాగానే.. భ‌య‌ప‌డుతున్నారా? స‌ర్‌..! అంటూ వ్యాఖ్యానించారు. నిజానికి జ‌గ‌న్ ఎందుకు భ‌య‌ప‌డాలి. ఒక్క శాతం ఓటు బ్యాంకు లేని పార్టీ గురించే ఆయ‌న భ‌య‌ప‌డితే.. 43 శాతం పైగా ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ విష‌యంలో ఆయ‌న ఎలా రియాక్ట్ కావాలి.

ఇక‌, 8 శాతం నుంచి 10 శాతం ఓటు బ్యాంకు ఉన్న జ‌న‌సేన గురించి.. జ‌గ‌న్ ఎలా ఆలోచ‌న చేయాలి. సో.. జ‌గ‌న్ న‌మ్ముకుంది.. పార్టీల‌ను కానీ, ఇత‌ర పార్టీల‌ ఓటు శాతాన్ని కానీ కాదు. ప్ర‌జ‌ల‌ను. ఆయ‌న ప్ర‌జ‌ల నిర్ణ‌యానికి మాత్ర‌మే క‌ట్టుబ‌డి ఉంటారు. కానీ, ష‌ర్మిల మాత్రం దూకుడుగా ఉన్నారు. ఆవేశ ప‌డుతున్నా రు. అతి పెద్ద జాతీయ పార్టీకి తాను అధ్య‌క్షురాలిననే స్వ‌ల్ప గ‌ర్వంఆమెకు ఉంటే ఉండొచ్చు. కానీ, అనేక ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ద్వారా.. ప్ర‌జ‌ల్లో ఉన్న వైఎస్ జ‌గ‌న్‌పై దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే.. అది అంతిమంగా ఆయ‌న‌కు మ‌రింత సానుభూతిని తీసుక‌వ‌చ్చిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.