Begin typing your search above and press return to search.

వీడియో... అలేఖ్య తారకరత్న బర్త్ డే వేడుకల్లో షర్మిళ!

అయితే... సామాజికవర్గాలు వేరైనప్పటికీ అలేఖ్య - తారకరత్న ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   8 Aug 2024 4:33 AM GMT
వీడియో... అలేఖ్య తారకరత్న బర్త్  డే వేడుకల్లో షర్మిళ!
X

నందమూరి తారకరత్న... అటు నందమూరి సినీ అభిమానులతోపాటు ప్రతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సుపరిచితుడు, మరిచిపోలేని జ్ఞాపకం. ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సమయంలో రికార్డ్ స్థాయిలో ఆయన ఓపెనింగ్స్ జరిగాయి. ఇక రాజకీయాల్లోనూ రాణించాలని తారకరత్న భావించారని చెబుతారు. అయితే ఇంతలోనే విధి మరొకటి తలచింది.

లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం నాడు కుప్పకూలి, చాలా రోజులు హాస్పటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తారకరత్న మృతి చెందారు. అయితే... తారకరత్న భార్య అలేఖ రెడ్డి.. విజయసాయిరెడ్డికి బంధువనే సంగతి తెలిసిందే. ఆ కుటుంబంతో విజయసాయికి మంచి అవినాభావసంబంధం ఉంది.

అయితే... సామాజికవర్గాలు వేరైనప్పటికీ అలేఖ్య - తారకరత్న ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎంతో సంతోషంగా నడుస్తున్న వారి జీవితంలో అనుకోని పెను విపత్తు ఎదురైంది. తారకరత్న అకస్మిక మృతి అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఈ సమయంలో ఆమెకు విజయసాయిరెడ్డి కూడా ఎంతో మోరల్ సపోర్టర్ గా నిలిచారని చెబుతుంటారు.

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా అలేఖ్య పుట్టిన రోజు సందర్భంగా షర్మిల తన కూతురితో కలిసి ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించి విషెస్ తెలిపారు. ఈ సమయంలో అలేఖ్య చాలా ఎమోషనల్ అయ్యారు. ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చిన షర్మిళ, ఆమె కూతురు కేక్ తినిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

కాగా... షర్మిళ కుమారుడి వివాహానికి కూడా భర్త అనీల్ తో కలిసి అలేఖ్య ఇంటికి వెళ్లి షర్మిళ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అలేఖ్య పుట్టిన రోజు కావడంతో స్వయంగా ఇంటికెళ్లి ప్రేమా, ఆప్యాయతా చూపించారు షర్మిళ.