Begin typing your search above and press return to search.

మనిషన్నాక విజ్ఞత ఉండాలి... షర్మిళపై అవినాష్ వైరల్ కామెంట్స్!

గత కొన్ని రోజులుగా కడప రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పైగా రాష్ట్రవ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేసే ఇష్యూ అవ్వడంతో

By:  Tupaki Desk   |   6 April 2024 4:39 PM GMT
మనిషన్నాక విజ్ఞత ఉండాలి... షర్మిళపై అవినాష్ వైరల్ కామెంట్స్!
X

గత కొన్ని రోజులుగా కడప రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పైగా రాష్ట్రవ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేసే ఇష్యూ అవ్వడంతో.. మీడియా ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో... ప్రధానంగా వివేకా హత్య కేసులో అవినాష్ పాత్ర, కడపలో ఎంపీ అభ్యర్థిగా షర్మిళ పోటీ, అందుకు కారణమైనదిగా చెబుతున్న అంశం, ఈ క్రమంలో షర్మిళ - సునీత లు అవినాష్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

ఇందులో భాగంగా... వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం ఉందంటూ షర్మిళ, సునీత లు ఇటీవల కాలంలో పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. పైగా... ఎన్నికలు సమీపిస్తోన్న ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలు, విమర్శలు మరింతగా పెరిగాయనే చెప్పాలి. ఇదే సమయంలో... చిన్నాన్న హత్యలో వెనుక ఉన్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారంటూ జగన్ పైనా విమర్శలు చేస్తున్నారు షర్మిళ, సునీత!

ఇలా తనపై తీవ్ర విమర్శలు, సంచలన ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకూ కడప సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించలేదు! ఈ క్రమంలో తాజాగా తనపై జరుగుతున్న దాడిపై అవినాష్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా తనపై ఆరోపణలు చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు!

అవును... గతకొన్ని రోజులుగా ఏపీపీసీసి చీఫ్, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి షర్మిళ తనపై చేస్తోన్న ఆరోపణలపై... ఆ నియోజకవర్గ ఎంపీ అవినాశ్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... తనపై మసి పూస్తారు, బురద వేస్తారు, తుడుచుకో అంటారు.. అలా తుడుచుకుంటూ పోతే, కడుక్కుంటూ పోతే తిడుతూనే ఉంటారని అవినాష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా తనపై చేస్తున్న విమర్శలకు వారి వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదే సమయంలో దీని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా అవసరం లేదని.. మాట్లాడేవారు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోవచ్చని, తనకు ఏ అభ్యంతరం లేదని తెలిపారు. అయితే... మనిషన్నాక కొంచెమైనా విజ్ఞత, విచక్షణా కొంచెమైనా ఉండాలని చెప్పి తాను కోరుకుంటున్నట్లు అవినాష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దీంతో... ఈ రియాక్షన్ ఆసక్తికరంగా మారింది.

కాగా.. తాజాగా చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మైకందుకున్న షర్మిళ... ఒక‌వైపు రాజ‌శేఖ‌ర‌రెడ్డి బిడ్డ నిల‌బడగా, మ‌రోవైపు ఆయ‌న త‌మ్ముడు వివేకానంద‌రెడ్డిని హ‌త‌మార్చిన అవినాష్‌ రెడ్డి ఉన్నారని.. హ‌త్య చేసిన వారికే జ‌గ‌న‌న్న మ‌ళ్లీ టికెట్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో... అలాంటి వాళ్లను గెలిపించాలా.. లేక, న్యాయం కోసం నిల‌బ‌డిన రాజ‌శేఖ‌ర‌రెడ్డి బిడ్డను గెలిపించాలా అనేది మీరే ఆలోచించుకోండని షర్మిళ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!