Begin typing your search above and press return to search.

డ్యాన్సుల అంబటీ...దీనికి జవాబు ఏమిటీ...!?

మంత్రి అంబటి రాంబాబుకు కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల గట్టిగా షాక్ ఇచ్చేశారు. ఆయనకు కొత్త పేరు పెట్టారు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 10:30 AM GMT
డ్యాన్సుల అంబటీ...దీనికి జవాబు ఏమిటీ...!?
X

మంత్రి అంబటి రాంబాబుకు కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల గట్టిగా షాక్ ఇచ్చేశారు. ఆయనకు కొత్త పేరు పెట్టారు. డ్యాన్సుల అంబటీ అంటూ ఆయన మీద సెటైర్లు వేశారు. జలవనరుల శాఖ మంత్రిగా అంబటి ఉన్నారు. ఆయనకు శాఖ మీద కంటే సంక్రాంతి డ్యాన్సుల మీదనే మక్కువ ఎక్కువ అని షర్మిల మండిపడ్డారు

వైఎస్ షర్మిల ఒంగోలు జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పనులను శనివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరోసారి వైసీపీ ప్రభుత్వం మీద తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. సంక్రాంతి పండుగకు డ్యాన్సులు చేసే అంబటికి మంత్రిగా బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

వైఎస్సార్ కల అని గుండ్లకమ్మ ప్రాజెక్ట్ విషయంలో మంత్రి ఏమి చేసారు అని ప్రశ్నించారు. వైఎస్సార్ ఈ ప్రాజెక్ట్ కోసం ఏడువందల యాభై కోట్ల రూపాయలు కేటాయించి నిర్మిస్తే దాని మెయింటెయినెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం పది కోట్ల రూపాయలు అయినా ఖర్చు చేయలేదా అని ఆమె నిలదీశారు.

కేవలం పది కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ నిలబడుతుందని అధికారులు చెబుతున్నారని,ఆ మొత్తం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదా అని ఆమె అన్న ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కట్టినా వేస్ట్ అయిపోతోందని అదంతా ప్రభుత్వం ఉదాశీన ఫలితమే అని షర్మిల అన్నారు.

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు చేయాల్సిన మరమ్మత్తులు చేయించాలని షర్మిల అన్నారు. ప్రాజెక్ట్ గేట్ నీటిలో తేలుతోంది అంటే జగన్ ప్రభుత్వానికి అది అవమానంగా అనిపించడంలేదా అని ఆమె ప్రశ్నించారు. అసలు వైసీపీ ప్రభుత్వం పని తీరు ఏంటి అన్నది ఈ గేటు ఒక్కటి చాలు చెప్పడానికి అని ఆమె దుయ్యబెట్టారు.

అంబటి రాంబాబుకు తన శాఖ పట్ల శ్రద్ధ లేదా అని ఆయన నిలదీశారు. ఆయన ఎంతసేపూ పని మానేసి డ్యాన్సులు వేస్తే సరిపోతుందా అని షర్మిల విమర్సించారు.గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ లోకి నీరు అందిస్తే 12 మండలాలకు సాగునీరు తాగునీరు అందిస్తుందని ఆమె అన్నారు.

అంతే కాదు జలయజ్ఞంలో అవినీతి చోటు చేసుకోబట్టే ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపించి గేట్లు కొట్టుకుపోయాయని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి వైఎస్సార్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడం వల్లే చుట్టుపక్క ప్రజలు ఆయన దేవుడిగా కొలుస్తున్నారని ఆమె గుర్తు చేసారు.

అందువల్ల అలాంటి ప్రాజెక్టుకు వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు ఏం చేశాయనేది సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే గేట్లు కొట్టుకోవడానికి కారణమయ్యాయని ఆమె నిందంచారు. మొత్తం మీద వైఎస్ షర్మిల వైసీపీలో ఫైర్ బ్రాండ్ మంత్రి అంబటి రాంబాబు మీదనే సెటైర్లు వేశారు. దానికి ఆయన ఏమి బదులిస్తారో చూడాల్సి ఉంది.