Begin typing your search above and press return to search.

కన్ ఫాం... వైసీపీ - టీడీపీలకు షర్మిల సమాన దూరం!

అవును... ఏపీసీసీ చీఫ్ హోదాలో తొలిసారి నాయకులను, కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 10:38 AM GMT
కన్ ఫాం... వైసీపీ - టీడీపీలకు షర్మిల సమాన దూరం!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో త్రిముఖ పోటీకి తెరలేస్తుంది! ఇందులో భాగంగా ఇప్పటి వరకూ వైసీపీ, టీడీపీ & కో ల మధ్య మాత్రమే పోరు అని భావిస్తున్న నేపథ్యంలో... సడన్ గా సమీకరణలు మారిపోయాయి. ఇందులో భాగంగా ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకోవడంతో కొత్త చర్చ మొదలైంది. ఇంతకాలం స్థబ్ధగా ఉన్న కాంగ్రెస్ కు కొత్త ఊపొచ్చినట్లయ్యింది! ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ హోదాలో తొలిసారి మాట్లాడిన షర్మిల కీలక విషయాలను ప్రస్థావించారు.

అవును... ఏపీసీసీ చీఫ్ హోదాలో తొలిసారి నాయకులను, కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తన తండ్రి రెండుసార్లు చేపట్టిన పీసీసీ చీఫ్ పదవి ఈరోజు తనకు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనను నమ్మి ఇంతనమ్మకాన్ని, బాధ్యతను తనపై ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

భూతద్ధం పెట్టి వెతికినా అభివృద్ధి లేదు!:

అనంతరం... గత ఐదు సంవత్సరాలుగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, అంతకముందు ఐదు సంవత్సరాలు తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉందని మొదలుపెట్టిన షర్మిల... ఈ పదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో రాష్ట్రం విడిపోయే నాటికి ఏపీకి ఉన్న అప్పులు లక్ష కోట్లు అని చెప్పిన షర్మిళ... నేడు ఆరులక్షల కోట్లకు చేరిందని తెలిపారు.

రోడ్లకు, జీతాలకు కూడా డబ్బులు లేవు!:

ఇలా లక్షల కోట్ల అప్పులు చేసినా రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించడం లేదని షర్మిల ఫైరయ్యారు. రాష్ట్రానికి రాజధాని లేదని, ఒక్క మెట్రో అయినా లేదని అన్నారు. ఇదే సమయంలో గత పదేళ్లలో కనీసం 10 పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించిన షర్మిల... కనీసం రోడ్లు వేసుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో డబ్బులు లేవని షర్మిల దుయ్యబట్టారు.

ఎటు చూసినా మాఫియా!:

ఇలా ఏపీలో అభివృద్ధి లేదు కానీ... రైతులపై దాడులు మాత్రం పెరిగాయని షర్మిల ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా అని... దోచు కోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని.. గత పదేళ్లుగా ఏపీలో ఇంతకు మించి జరిగిందేమీ లేదని షర్మిల నిప్పులు చెరిగారు.

ప్రత్యేక హోదా రాలేదు కాదు.. తేలేదు!:

ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయని, పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పిన షర్మిల... రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ప్రత్యేక హోదా రాలేదని అన్నారు. అసలు రాలేదు అని అనడం కంటే... పాలకులు తేలేదు అనడం కరెక్ట్ అని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో జరిగిన ప్రయోజనాలను వివరించారు. అలాంటి ప్రత్యేక హోదాని తేవడం పాలకులకు చేతకాలేదన్ని విమర్శించారు.

ఈ సందర్భంగా విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే... ఎన్నికల వేళ పదేళ్లు హోదా ఇస్తామని మోడీ చెప్పడం, పదిహేనేళ్లు ఇస్తారనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని చంద్రబాబు చెప్పడం జరిగిందని.. ఫలితంగా ఆ ఎన్నికల్లో గెలిచి టీడీపీ నేతలు బీజేపీ కేబినెట్ లో మంత్రులు కూడా అయ్యారని తెలిపారు. అలా సీఎం అయిన తర్వాత చంద్రబాబు ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం పోరాడారా అని షర్మిల ప్రశ్నించారు.

ఈ విషయంలో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కానీ జగన్ కానీ ఏనాడూ సిన్సియర్ గా పనిచేయలేదని... ఏపీకి ప్రత్యేక హోదా రాని పాపం ముమ్మాటికీ వీరిద్దరిదీ అని షర్మిల తెలిపారు. వారి వారి స్వలాభాల కోసం ఆ ఇద్దరూ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని షర్మిల విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ - వైసీపీ రెండూ దొందూ దొందే అని షర్మిళ ఎద్దేవా చేశారు.

3డీ గ్రాఫిక్స్ సరే... రాజధాని ఏది?:

ఏపీకి అమరావతి అని చెప్పిన చంద్రబాబు.. సింగపూర్ చేస్తానన్నాడని, మొత్తం త్రీడీ గ్రాఫిక్స్ చూపించాడని.. ఆఖరికి రాజధాని కాలేదని విమర్శించారు షర్మిళ. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పి.. ఒక్కటి కూడా పూర్తిచేయలేదని అన్నారు. ఈ రోజు ఏపీకి రాజధాని ఏది అని అడిగితే సమాధానం లేదని, ఒకటి కూడా లేదని షర్మిల ఫైర్ అయ్యారు.

పోలవరం తాకట్టు!:

1941 లో కట్టాలని తలంచిన పోలవరం ప్రాజెక్టు వైఎస్సార్ సీఎం అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా మొదలయ్యి.. కాల్వల పనులు కూడా మొదలయ్యాయని చెప్పిన షర్మిళ... చంద్రబాబు, జగన్ లు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారని దుబ్బయట్టారు. అనంతరం వైసీపీ, టీడీపీ, బీజీపీలను ఒకే గాటిన కట్టిన షర్మిల... మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటలో చలికాసుకోవడమే బీజేపీ పని అని అన్నారు.