Begin typing your search above and press return to search.

షర్మిళ మాట... "నాకు జగనన్న అంటే చాలా ఇష్టం"!

అవును... ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో భాగంగా బిజీగా ఉన్న షర్మిళను అనంతపురంలో పలువురు అభిమానులు పలకరించారు.

By:  Tupaki Desk   |   29 Jan 2024 8:00 AM GMT
షర్మిళ మాట... నాకు జగనన్న  అంటే చాలా ఇష్టం!
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిళ అనే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. నిన్నమొన్నటివరకూ షర్మిళ తెలంగాణ పాలిటిక్స్ లో ఉండిపోవడంతో ఏపీలో ఆమెను గూర్చిన చర్చ పెద్దగా జరగలేదు. అయితే... ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాలకు తెరదించి.. ఏపీపీసీసీ చీఫ్ హోదాలో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లోకి ఎంటరైన షర్మిళ.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

ఇందులో భాగంగా ప్రత్యేక హోదా కాంగ్రెస్ వల్లే వస్తుంది అని చెబుతున్న షర్మిళ... బీజేపీ - వైసీపీలకు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు కానీ, టీడీపీ - వైసీపీలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అనే విషయం బలంగా స్పష్టం చేయడం లేదని అంటున్నారు. ఈ సందర్భంగా... ప్రస్తుతం రాయలసీమలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన షర్మిల... తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో భాగంగా బిజీగా ఉన్న షర్మిళను అనంతపురంలో పలువురు అభిమానులు పలకరించారు. ఇందులో భాగంగా... ఆమె దగ్గరికి వెళ్లి తామంతా వైఎస్ కుటుంబమని చెప్పారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన చేతిపై వేయించుకున్న జగన్ టాటూను చూపించగా, "వెరీ గుడ్" అని షర్మిల అన్నారు. అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ సోషల్ మీడియాలో రీసౌండ్ వచ్చేలా ఉన్నాయి.

ఇందులో భాగంగా... తనవద్దకు వచ్చిన జగన్ అభిమానులను ఉద్దేశించి స్పందించిన షర్మిళ... "నాకు కూడా జగనన్న అంటే చాలా ఇష్టమమ్మా.. కానీ ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడం తప్పు కదా?" అని అన్నారు. దీంతో... ఈ మాటలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు షోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

కాగా... వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మైకుపట్టుకున్న ప్రతీసారి ఆమె వైసీపీ ప్రభుత్వంపై ఫైరవుతున్నారు. ప్రధానంగా జగన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీలో టిక్కేట్లు దొరకని, అసంతృప్త నేతలను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తుంది.. వారికి అడిగిన చోట కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

https://twitter.com/tupaki_official/status/1751856497959817692