Begin typing your search above and press return to search.

ఏపీలో పాతుకుపోవడానికి షర్మిళ వేసిన పెద్ద ప్లాన్ ఇదేనా?

ఏపీలో ప్రస్తుతం కూటమి పార్టీ అధికారంలో ఉంది. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది

By:  Tupaki Desk   |   14 July 2024 12:30 AM GMT
ఏపీలో పాతుకుపోవడానికి షర్మిళ వేసిన పెద్ద ప్లాన్ ఇదేనా?
X

ఏపీలో ప్రస్తుతం కూటమి పార్టీ అధికారంలో ఉంది. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. పైగా... కూటమికి దక్కిన భారీ విజయం అనంతరం వైసీపీ నేతలు పలువురు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారని.. ఎంపీలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే వైసీపీ నేతలకు కండువాలు కప్పే అప్రజాస్వామికమైన పనికి టీడీపీ, జనసేన సిద్ధంగా లేవని తెలుస్తుంది.

ఈ స్థాయిలో ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి కక్కుర్తి పనులు చేయడం స్థాయి తక్కువ అని భావిస్తున్నారని అంటున్నారు. పైగా నిన్న మొన్నటి వరకూ వారిపై తీవ్ర విమర్శలు చేసి, ఇవాళ కండువాలు కప్పి వాషింగ్ పౌండర్ నిర్మా టైపు రాజకీయాలను ఇకపై సమర్ధించకూడదని భావించారని తెలుస్తోంది. దీంతో... వైసీపీ నేతలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోందని అంటున్నారు.

అవును.. ఏపీలో విపక్షం పూర్తిగా వీక్ అయిపోయిన నేపథ్యంలో... అటు రేవంత్ రెడ్డి, ఇటు డీకే శివకుమార్ ల సౌజన్యంతో.. కేవీపీ లాంటివారి సూచనలతో ఏపీలో షర్మిళ సెకండ్ ఆప్షన్ గా మారాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇటీవల జరిగిన వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమాలను ఆ స్థాయిలో గ్రాండ్ గా చేసి, వైఎస్సార్ కి కాంగ్రెస్ పార్టీ, తాను మాత్రమే అసలైన వారసులం అన్నట్లుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు.

వైఎస్సార్ వారసుడిగా తన అన్నకు ఇచ్చిన ఒక్క అవకాశం అయిపోయింది.. రెండో అవకాశం ఇచ్చే విధంగా ఆయన పాలన సాగించలేదు.. అందువల్ల కూటమికి ప్రత్యామ్న్యాయంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని.. తద్వారా ఈ రోజు కాకపోతే రేపు అయినా మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని షర్మిళ భావిస్తున్నారట. అది జరగాలంటే... ఏపీలో వైసీపీ పూర్తిగా కనుమరుగైపోవాలనేది ఆమె లక్ష్యం అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... కూటమిపై పోటీ చేసి గెలవడం సంగతి తర్వాత, ముందుగా ఏపీలో కూటమికి ప్రత్యామ్నాయంగా మారాలనే తొలి లక్ష్యాన్ని షర్మిళ నిర్దేశించుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పూర్తిగా జగన్ వైఖరి, వ్యవహార శైలి వల్లే ఓడిపోయామని బలంగా నమ్ముతున్న నేతలను షర్మిళ ముందుగా ఎంచుకున్నారని అంటున్నారు. పైగా వారిలో పలువురు కీలక నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వారు గనుక కాంగ్రెస్ కండువా కప్పాలని షర్మిల ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తుంది. పైగా... షర్మిళ పక్క కేవీపీ లాంటి వారు ఉండటంతో వైసీపీలో ఉన్న పలువురు కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు ఆకర్షితులయ్యే ఆవకాశం ఉందని చెబుతున్నారు. మరి షర్మిళ ఎంచుకున్న ఈ తోలి లక్ష్యం నెరవేరుతుందా.. ఆమె ఈ టార్గెట్ ను వీలైనంత తొందర్లో ఫినిష్ చేస్తారా అనేది వేచి చూడాలి.