'గడప గడపకు కాంగ్రెస్'-షర్మిల ఎన్నికల ప్రచారం
ఈ నేపథ్యంలో ఆ 9 గ్యారెంటీ ల కరపత్రం, డోర్ స్టిక్కర్ లను షర్మిల ఆవిష్కరించారు.
By: Tupaki Desk | 31 March 2024 8:00 AM ISTఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింప చేసే లక్ష్యంతో ఆ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల... తాజాగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ``గడపగడపకు కాంగ్రెస్`` అని పేరు పెట్టారు. విజయవాడ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన షర్మిల.. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 9 గ్యారెంటీలు అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ 9 గ్యారెంటీ ల కరపత్రం, డోర్ స్టిక్కర్ లను షర్మిల ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 1500 అప్లికేషన్లు వచ్చాయ ని తెలిపారు. వీటిలో బీ ఫామ్ లు మాత్రం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు 25 మంది ఎంపీ అభ్యర్థులు మాత్రమే వస్తాయని షర్మిల తెలిపారు. హైకమాండ్ తో చర్చించి, సోమవారం జాబితా విడుదల చేయను న్నట్టు తెలిపారు. టిక్కెట్ రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించాలన్నారు. అలా చేయకపోతే చరిత్ర మనలను క్షమించదన్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గురించి సర్వేలు చేసి,రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఎంపిక చేస్తున్నామని షర్మిల తెలిపారు. అభ్యర్థి పనితనం ఆధారంగా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అని, రీజినల్ పార్టీ కాదని.. కాబట్టి టికెట్ రాని వారు అర్ధం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజాస్వామ్య బద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని షర్మిల తెలిపారు. టిక్కెట్ రాని వాళ్ళు అభ్యర్థి కోసం కాదు...పార్టీ కోసం,ప్రజల కోసం,దేశం కోసం పని చేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రావాలి.. కాంగ్రెస్ అధికారంలో లేకుంటే ఎలా ఉందో చూస్తున్నామ న్నారు. మణిపూర్ లాంటి ఘటనలు ఇందుకు ఉదాహరణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం.ఇదే మన బలమని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయక పోతే చరిత్ర హీను లుగా మిగులుతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పాటు పడదాం మన బిడ్డల భవిష్యత్ కాపాడుకుందామని షర్మిల పిలుపునిచ్చారు.
బీజేపీ మేలు చేయక పోయినా బాబు,జగన్ లు బానిసలు గా మారారని షర్మిల విమర్శించారు. హోదా 10 ఏళ్లు రావాలి ఇవాల్టి వరకు హోదా ఊసే లేదు.. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు..అయినా బాబు,జగన్ ఇద్దరు దొందు దొందే అన్నారు. చంద్రబాబు బీజేపీ తో 2014 లో పొత్తు పెట్టుకొని విడాకులు తీసుకున్నారు.. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారన్నారు. జగన్ ను ఏకంగా నిర్మలా సీతారామన్ మోడీకి దత్తపుత్రుడు అన్నారని తెలిపారు. ఒకరిది బహిరంగ పొత్తు..మరొకరిది రహస్య పొత్తు.. ఒకరిది సక్రమైన పొత్తు.మరొకరిది అక్రమ పొత్తు అని షర్మిల ఎద్దేవా చేశారు.