Begin typing your search above and press return to search.

వైయస్ షర్మిల ఆంధ్రాకు వస్తే జగన్ కే ప్లస్

అవును.మీరు కరెక్ట్ గానే చదువుతున్నారు. జగన్ చెల్లెలు షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే చెల్లిపోయేది కచ్చితంగా టీడీపీకే అన్నది ఒక కఠినమైన విశ్లేషణ.

By:  Tupaki Desk   |   1 Jan 2024 1:29 PM GMT
వైయస్ షర్మిల ఆంధ్రాకు వస్తే జగన్ కే ప్లస్
X

అవును.మీరు కరెక్ట్ గానే చదువుతున్నారు. జగన్ చెల్లెలు షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే చెల్లిపోయేది కచ్చితంగా టీడీపీకే అన్నది ఒక కఠినమైన విశ్లేషణ. అదెలా అంటే ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వానికి ఓట్లు వేయాలనుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో వేస్తారు. వేయకూడదు అని లేక వ్యతిరేక ఓటు అని టీడీపీ సహా విపక్షాలు చేస్తున్న విష ప్రచారం కనుక నిజం అయితే మాత్రం ఆ వ్యతిరేక ఓటు అన్నది ఎటు వెళ్తుంది అన్నది ప్రశ్న.

నిజానికి వైసీపీకి వేయవద్దు అనుకుంటే అయిదేళ్ల పాటు విభజన ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు మాత్రమే కచ్చితంగా వేస్తారని ఎలా అనుకుంటారని ప్రశ్నలు ఉన్నాయి. అలా ఎందుకు జరగాలి. ఇదేమైనా నీరు పల్లెమెరుగు అన్న సామెతగా ఉంటుందా. కచ్చితంగా నీరు అంతా పల్లానికి పోతుంది అన్నట్లుగా టీడీపీకే వైసీపీ వ్యతిరేక ఓటు టర్న్ ఎందుకు కావాలని కూడా లాజిక్ గా ఆలోచించే వారు వేస్తున్న ప్రశ్నలు.

చూసుకుంటే కనుక జనాలకు విపక్షాలలో ఎన్నో ఆప్షన్లు అపుడు కనిపిస్తాయి. అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయవద్దు అని జనసేన టీడీపీ జట్టు కట్టాయి.

ఇంకా బీజేపీ లాంటి పార్టీల కోసం చూస్తున్నాయి. అయితే ఎపుడో పదేళ్ళ క్రితం ఏపీ రాజకీయాలలోనే లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని లేపడానికి వైఎస్ షర్మిల లాంటి వారు వస్తే కనుక ఆ వైపు చూసే వారు కొందరైనా ఉంటే మాత్రం ఆ దెబ్బ కచ్చితంగా తగిలేది టీడీపీకే అని అంటున్నారు మేధావులు, రాజకీయ విశ్లేషకులు.

ఎలా అంటే ఎపుడూ ప్రభుత్వ వ్యతిరేకత గుత్తమొత్తంగా ఒక పార్టీకి పడితేనే గెలుపు అవకాశాలు ఉంటాయి. అదే అధికార పార్టీ పట్ల ఫేవర్ గా ఉండే వారు ఉంటే ఆ ఓటింగ్ గట్టిగా ఉంటే మాత్రం ఏ రకమైన ఇబ్బందులు వైసీపీకి ఉండవు. ఏపీలో చూసుకుంటే వైసీపీకి తనకంటూ పాజిటివ్ ఓటింగ్ ఉందని ధీమాగా చెబుతోంది.

ఇక అయిదేళ్ల తరువాత ఏ ప్రభుత్వానికైనా ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నా దాన్ని క్యాచ్ చేసే స్థితిలో టీడీపీ లేదు అని అంటున్నారు. అదెలా అంటే టీడీపీ గత పాలన ప్రజలు చూసి ఉన్నారు కాబట్టి అంటున్నారు. దాంతో టీడీపీ ఓటు బ్యాంక్ అలాగే ఉంటే తటస్థులు వ్యతిరేక ఓట్లు అనుకుంటున్నవి కనుక చీలితే కచ్చితంగా అది టీడీపీకే అతి పెద్ద దెబ్బ అవుతుంది అని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అయితే చెల్లెలు షర్మిల వస్తోంది. ఏపీలో జగన్ పార్టీకి ఇబ్బంది అని భావిస్తోంది అంటున్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియాలో కూడా దీని మీదనే వార్తలు రాస్తున్నారు అంటున్నారు. వైసీపీ పెద్దలు షర్మిల రాకను చూసి భయపడుతున్నారు అని కూడా వార్తలు టీడీపీ అనుకూల మీడియాలో వండి వారుస్తున్నారు.

కానీ వాస్తవాలు గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ని వారు కావాలనే మరచిపోతున్నారు అని అంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వమని ఒకసారి అంటున్న విపక్షాలు మరో వైపు షర్మిల కాంగ్రెస్ కి ప్రచారం చేస్తే ఆ వచ్చే ఓట్లు తన కూటమి నుంచి చీలిపోతున్నాయని ఎందుకు ఆలోచించడంలేదు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఇక జగన్ కి భయం అన్నది తెలియదు అన్న సంగతి ఏపీ జనాలకు మొత్తం తెలుసు అని అంటున్నారు. జగన్ కనుక భయపడే వారు అయితే కచ్చితంగా నాడు సోనియా గాంధీని ఆమె యూపీయే చైర్ పర్సన్ గా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి బయటకు వచ్చేవారు కాదని కూడా చెబుతున్నారు. అంతే కాదు జగన్ సీబీఐ కేసులకు కానీ జైలు జీవితానికి కానీ ఎక్కడ భయపడలేదని అన్నీ ధైర్యంగా ఎదుర్కొన్నారని కూడా గుర్తు చేస్తున్నారు.

అంతే కాదు జగన్ 2014 ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే అందులో 23 మందిని టీడీపీ వారు తీసుకున్నా ఆయన భయపడలేదని కూడా గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో నాడు టీడీపీ పెద్దలు ఎన్ని మాటలు అన్నా కూడా జగన్ ఎక్కడా వెరవలేదు అని కూడా గుర్తు చేస్తున్నారు.

అలాంటిది ఇపుడు వైఎస్ షర్మిల రూపంలో కాంగ్రెస్ నుంచి తనకు తన వైసీపీకి రాజకీయ నష్టం కలుగుతుందని జగన్ ఎలా భావిస్తారని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఇదంతా టీడీపీ వారు తాము భ్రమలలో ఉంటూ దాన్నే ప్రచారం చేసుకుంటున్నారని అంటున్నారు.

కాంగ్రెస్ కి ఏ కొన్ని ఓట్లు వచ్చినా కూడా అవన్నీ కూడా కచ్చితంగా టీడీపీకే డ్యామేజ్ చేస్తాయని ఇది పరమ సత్యం అని అంటున్నారు. టీడీపీ జనసేన కమ్యూనిస్టుల ఓట్లు అన్నీ కూడా కాంగ్రెస్ కి ఎంతో కొంత పోతాయని కూడా అంటున్నారు. మరో వైపు టీడీపీ నేతలే తాము భయపడుతూ బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారు అని అంటున్నారు.

ఈ వాస్తవాలు తెలిసినా తెలియనట్లుగా ఫీల్ అయినా లేక నిజంగా భ్రమలలో ఉన్నా రేపటి రోజున కచ్చితంగా జరిగేది అదే అని అంటున్నారు. వైసీపీ అయితే సోలో గానే వెళ్తాం, ఫైట్ ఇస్తామని మళ్ళీ గెలుస్తామని డ్యాం ష్యూర్ గా చెబుతోంది. సో చెల్లెలు వస్తే చెల్లిపోయేది మునిగిపోయేది టీడీపీయే అని అంటున్నారు.