Begin typing your search above and press return to search.

షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తారా...!?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు దక్కుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 4:45 AM GMT
షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తారా...!?
X

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు దక్కుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఆమె తన పార్టీని కాంగ్రెస్ విలీనం చేసినపుడు ఆమెను రాజ్యసభకు పంపుతామని ఒక హామీ కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చినట్లుగా ప్రచారం అయితే సాగింది. కర్నాటక నుంచి వచ్చే కోటాలో ఒక సీటుని షర్మిలకు కేటాయిస్తారు అని అంతా అనుకున్నారు.

ఇపుడు రాజ్యసభ సీట్లకు అభ్యర్ధుల ప్రకటన జరుగుతోంది. దేశ వ్యాప్తంగా 55కి పైగా ఖాళీలు పెద్దల సభలో ఏర్పడనున్నాయి. అందులో అత్యధిక భాగం బీజేపీకి దక్కనున్నాయి. కాంగ్రెస్ దేశంలో మూడు రాష్ట్రాలలోనే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణాలలో కాంగ్రెస్ పవర్ లో ఉంది.

ఈ మూడింటితో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలలో విపక్షంలో ఉంది. ఇలా చూసుకుంటే కాంగ్రెస్ కి ఒక పది దాకా రాజ్యసభ సీట్లు దక్కే చాన్స్ ఉంది. మరి ఇందులో షర్మిల పేరు అయితే ఇప్పటిదాకా వినిపించడం లేదు.

ఆమెను ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పంపించారు. ఆమె తన శక్తియుక్తుల్ని ప్రదర్శించి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలి. కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన టార్గెట్ నోటా కంటే తక్కువ ఓటు షేర్ ఉన్న కాంగ్రెస్ కి ఈసారి పది నుంచి పదిహేను శాతం ఓటు షేర్ వచ్చేలా చేయాలన్నది. అదే టైం లో కనీసం కొన్ని అయినా ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తాయా అన్న ఆశ కూడా పెట్టారని అంటున్నారు.

నిజానికి చూస్తే ఇంత పెద్ద ఓటు షేర్ కాంగ్రెస్ కి రావడం కష్టం. పైగా ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వందలాది దరఖాస్తులు వచ్చాయి కానీ అందులో బాగా పేరున్న వారు బిగ్ షాట్స్ అయితే లేరు. పోటీ నామమాత్రంగానే ఉండబోతోంది అని అంటున్నారు. సో ఈ విధంగా ఉన్న కాంగ్రెస్ తో ఎన్నికల్లో పోటీ చేసి అనుకున్న టార్గెట్ ని రీచ్ కాకపోతే షర్మిల రాజకీయ భవితవ్యం ఇబ్బందులలో పడుతుంది అని అంటున్నారు

ఏపీలో ఎన్నికల కంటే ముందే జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో షర్మిలకు కనుక ఎంపీగా చాన్స్ ఇస్తే మాత్రం ఆమె ఫ్యూచర్ ఎంతో కొంత బాగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ కాంగ్రెస్ లో చూస్తే ఆ విధంగా ప్రకటన వస్తుందా అన్నదే చర్చగా ఉంది. కర్నాటక నుంచి షర్మిలకు రాజ్యసభ ఇస్తే మాత్రం కాంగ్రెస్ వైఎస్సార్ కుటుంబం పట్ల ఎంతో కొంత విశ్వాసం ఉంచి హామీని నెరవేర్చింది అనుకోవచ్చు అంటున్నారు. అలా కనుక చేస్తే ఏపీలో కూడా కాంగ్రెస్ కి కొంత ప్లస్ అయ్యే చాన్స్ ఉంది. అలా కాకపోతే మాత్రం షర్మిల ఏపీ రాజకీయం ఎలా సాగుతుందన్నది ప్రజలే తీర్పు చెప్పాల్సి ఉంటుంది.