Begin typing your search above and press return to search.

షర్మిలకు నీడనివ్వని కాంగ్రెస్...... ఊరిస్తున్న పాలేరు సీటు...!

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సాటీపీని విలీనం చేయడానికి ఇప్పటిదాకా ఎదురుచూసిన వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఇపుడు వేరే ఆలోచనలలో పడినట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   21 Sep 2023 3:30 PM GMT
షర్మిలకు నీడనివ్వని కాంగ్రెస్...... ఊరిస్తున్న పాలేరు సీటు...!
X

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సాటీపీని విలీనం చేయడానికి ఇప్పటిదాకా ఎదురుచూసిన వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఇపుడు వేరే ఆలోచనలలో పడినట్లుగా తెలుస్తోంది. తన పార్టీని విలీనం చేయకుండా వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీకి సిద్ధం అవుతున్నట్లుగా చెబుతున్నారు. దానికి కారణం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కొన్ని షరతులు పెడుతుంది. షర్మిలకు కొన్ని షరతులు ఉన్నాయి.

ఈ రెండింటినీ పొసగడం లేదు అంటున్నారు. వైఎస్ షర్మిల సేవలను ఏపీకే ఎక్కువగా వాడుకోవాలని కాంగ్రెస్ హై కమాండ్ చూస్తోంది అని అంటున్నారు. ఆమె వైఎస్సార్ కుమార్తె కావడం, అక్కడ ఆమె సోదరుడు వైఎస్ జగన్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టడంతో దాన్ని తిరిగి సాధించాలన్న ఆలోచనలలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.

అది జరగాలీ అంటే వైఎస్సార్ కుటుంబం నుంచి ఒక చీలిక రావాలని షర్మిల అయితే ఎంతో కొంత ఓటు బ్యాంక్ ని వెనక్కి రప్పించగలరని ఆ పార్టీ యోచిస్తోంది. కాంగ్రెస్ లో షర్మిల చేరితే కర్నాటక నుంచి రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తామని కూడా చెబుతున్నారని తెలుస్తోంది. అయితే తాను తెలంగాణాలో రాజకీయాలకే పరిమితం అవుతానని షర్మిల చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.

అంతే కాదు ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీకి కూడా షర్మిల పట్టుబడుతున్నారు. అయితే అక్కడ నుంచి మాజీ మంత్రి బీయారెస్ నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు కి టికెట్ కన్ ఫర్మ్ అయింది అని అంటున్నారు. ఆయన ఆ సీటు మీద కన్ను వేసి కాంగ్రెస్ లో చేరారు అని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ లో చేరాక ఆయన పాలేరులోని తన అనుచరులతో సమావేశాలు జరిపారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తుమ్మల కాంగ్రెస్ నుంచి పాలేరు సీటులో పోటీ పడడం ఖాయమని తెలుస్తోంది. దీంతో షర్మిల ఆశలు పూర్తిగా నీరుకారాయని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పెద్దలు మూడు రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్నా కూడా షర్మిల పార్టీ విలీనం విషయం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.

ఒక విధంగా చెప్పాలీ అంటే కాంగ్రెస్ లైట్ తీసుకుందని అంటున్నారు. దీంతో షర్మిలకు ఆప్షన్లు లేవని అంటున్నారు. ఆమె చేరితే కాంగ్రెస్ కండిషన్లకు అంగీకరించి పార్టీలో చేరాలి. ఒక డిసెంబర్ లో తెలంగాణాలో జరిగే ఎన్నికల్లో ఆమె ప్రచారం చేయాలి. ఆ మీదట అంటే 2024 ఏప్రిల్ లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇస్తారు.

ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణాలో గెలవకపోయినా మరే ఇతర కారణాలు ఉన్నా కూడా ఆ హామీ కూడా ఏమవుతుంది ఎవరూ చెప్పలేరు. మొత్తానికి షర్మిల విషయంలో కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఎంతో చెప్పి కేంద్ర నాయక్త్వాన్ని కన్వీన్స్ చేసినా కూడా హస్తం పార్టీ నీడకు షర్మిల చేరుకోలేకపోయారు అంటున్నారు.

దాంతో ఆమె రెండేళ్ల క్రితమే తాను పాలేరులో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించారు. అక్కడ జెండా ఆవిష్కరించారు. పార్టీ ఆఫీసు తెరిచారు. ఇపుడు కూడా ఆమె లేటెస్ట్ గా చూస్తే తన పార్టీ క్యాడర్ తో సమావేశం అవుతున్నారు. తన సొంత పార్టీ తరఫునే పాలేరు నుంచి పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని షర్మిల పట్టుదల మీద ఉన్నారని అంటున్నారు.

అయితే అదంత ఈజీ కాదని అంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు బిగ్ షాట్. ఆయనకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. దాంతో ఆయన వేవ్ కనుక ఉంటే దూసుకునిపోతారు. మరో వైపు చూస్తే బీయారెస్ కూడా పోటీకి దిగుతుంది, బీజేపీ ఎటూ ఉంటుంది. ఇన్ని పార్టీలను తట్టుకుని షర్మిల విజయం సాధ్యమేనా అంటే ఆమెకు అదే అసలైన ఆప్షన్ అంటున్నారు. సో పాలేరు నుంచి షర్మిల పోటీ ఖాయమని అంటున్నారు.