Begin typing your search above and press return to search.

ఛార్జ్ షీట్ లో వైఎస్సార్ పేరు వ్యవహారం... మరో బాంబు పేల్చిన షర్మిల!

ఆస్తుల కేసుల నుంచి బయట పడేందుకు కావాలని జగనే పిటీషన్ వే యించారని షర్మిల ఆరోపించారు.

By:  Tupaki Desk   |   26 April 2024 8:23 AM GMT
ఛార్జ్  షీట్ లో వైఎస్సార్  పేరు వ్యవహారం... మరో బాంబు పేల్చిన షర్మిల!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రసవత్తర రాజకీయం తెరపైకి వస్తోంది. ప్రధానంగా గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిళ మధ్య జరుగుతున్న రాజకీయ విమర్శలు, కుటుంబ సమస్యల వ్యవహారం తారాస్థాయికి చేరుతుంది. ఈ సమయంలో... పులివెందులలో నామినేషన్ సందర్భంగా వైఎస్ జగన్ చేసిన ప్రసంగం, అందులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగా వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు?.. అసలు ఆయన పేరును ఛార్జిషీట్‌ లో పెట్టింది ఎవరు?.. వైఎస్సార్‌ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లు ఎవరు?.. పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లు వైఎస్సార్‌ వారసులా? అంటూ జగన్ నిప్పులు చెరిగారు.

ఈ క్రమంలో వైఎస్ షర్మిళ మరోసారి బాంబు పేల్చారు. ఇందులో భాగంగా... వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్యయంగా తన అన్న వైఎస్ జగనే అని వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జిషీట్ లో జగనే చేర్చించారని ఆమె ఆరోపించారు.

ఆస్తుల కేసుల నుంచి బయట పడేందుకు కావాలని జగనే పిటీషన్ వేయించారని షర్మిల ఆరోపించారు. ఇందులో భాగంగా... పొన్నవోలు సుధాకర్ రెడ్డితో హైకోర్టులో పిటీషన్ వేయించిన జగన్... అదే పోన్నవోలుకి ఇప్పుడు ఏపీలో అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారని తెలిపారు. తాను చెబుతున్న మాటల్లో నీజం లేకపొతే... ఇది నిజం కాదని దమ్ముంటే జగన్ సమాధానం చెప్పాలని షర్మిళ సవాల్ చేశారు!

ఈ క్రమంలోనే... వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఛార్జిషీట్ లో చేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని స్పష్టం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా... గతంలో ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీని వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్న సమయంలో స్పందించిన షర్మిల... "కాంగ్రెస్ పార్టీ పొరబాటున వైఎస్ పేరు చేర్చిందని.. ఆ విషయం స్వయంగా సోనియా గాంధీనే తనకు చెప్పారని" వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో... షర్మిళ ఇలా ఒకే విషయంలో రెండు స్టేట్ మెంట్స్ ఇస్తూ నాలుక మడత రాజకీయం చేస్తున్నరంటూ విమర్శలు తెరపైకి వస్తున్నాయి!