Begin typing your search above and press return to search.

రుషికొండ విషయంలో షర్మిళ ఎంట్రీ... కీలక వ్యాఖ్యలు!

ఈ సమయంలో ఇటీవల టీడీపీ నేతలు రుషికొండ భవనాలను సందర్శించారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 5:52 AM GMT
రుషికొండ విషయంలో షర్మిళ ఎంట్రీ... కీలక వ్యాఖ్యలు!
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రుషికొండం అంశం అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రతిపక్షంలో ఉన్నప్పటినుంచీ విమర్శలు గుప్పిస్తూ, పలు ఆరోపణలు చేస్తున్న విపక్షాలు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పూర్తి శ్రద్ధపెట్టినట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఇటీవల టీడీపీ నేతలు రుషికొండ భవనాలను సందర్శించారు.

ఇందులో భాగంగా... భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాలను పరిశీలించారు. ఇదే సమయంలో ఆయనతోపాటు మీడియా ప్రతినిధులనూ తీసుకెళ్లి.. ఇంతకాలం బయట ప్రపంచానికి తెలియని లోపల వైభోగాలను చూపించారు. దీంతో... ఈ విషయం మరింత వైరల్ గా మారింది. ఈ సమయంలో రుషికొండ వ్యవహారంపై షర్మిళ స్పందించారు.

అవును... ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన రుషికొండ విషయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు, కీలక డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా.. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఇలాంటి వాటిని అంగీకరించే ప్రసకే ఉండదని అన్నారు. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.

కాగా... రుషికొండపై గతంలో పర్యాటక శాఖకు చెందిన కాటేజ్ లు ఉండేవి. అయితే జగన్ సర్కార్ వాటిని కూల్చేసి స్టార్ హోటల్ కడతామని చెప్పింది! కానీ... గెస్ట్ హౌస్ లు వంటి నిర్మాణాలు చేసిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి నేతృత్వంలో కమిటీ వేయగా... సీఎం క్యాంప్ ఆఫీసుగా వినియోగించుకోవచ్చని సిఫారసు చేసింది.

ఈ నేపథ్యంలోనే... ఎన్నికలు పూర్తయ్యి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ వచ్చి కాపురం పెట్టి, ఇక్కడ నుంచే పాలన చేయాలనుకుంటున్నట్లు జగన్ ప్రకటించారు. అయితే ఫలితాలు పూర్తిగా తేడా కొట్టడంతో... ఈ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవుతుందని అంటున్నారు. ఈ సమయంలోనే... షర్మిళ కూడా ఎంట్రీ ఇచ్చారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.