వైసీపీలోకి షర్మిల...తెర వెనక ఏం జరుగుతోంది...!?
అదే విధంగా ఆమె వస్తే కనుక పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుందని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వంటి వారు చెబుతున్నారు.
By: Tupaki Desk | 31 Dec 2023 3:15 AM GMTవైఎస్ షర్మిల ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు కారణం అవుతున్నారు. ఆమె మరి కొద్ది రోజులలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అదే విధంగా ఆమె వస్తే కనుక పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుందని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వంటి వారు చెబుతున్నారు.
నేడో రేపో ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఈ శుభవార్తలకు వేదిక ముహూర్తం అంతా కొత్త ఏడాదిలోనే ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలో చాలా ఆసక్తికరమైన వార్త మరొకటి చక్కర్లు కొడుతోంది.
వైసీపీలోకి షర్మిలను తీసుకుని వచ్చేందుకు చర్చకు జరుగుతున్నాయన్నదే ఆ వార్త. ఇపుడు ఈ వార్త వైరల్ అవుతోంది. షర్మిల తెలంగాణా రాజకీయాల్లో ఉంటే ఏమో కానీ ఏపీలో ఆమె వస్తే ఎంతో కొంత ఇబ్బంది వస్తుందని కూడా వైసీపీ వర్గాలు ఊహిస్తున్నాయని అంటున్నారు. అవన్నీ పక్కన పెడితే అన్నా చెల్లెలు ఎదురు నిలిచి రాజకీయ పోరాటం చేసుకోవడం కూడా బాగుండని చెడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో వైఎస్సార్ కుటుంబానికి సంబంధించిన పెద్ద ఒకరు రాయబరాన్ని వైసీపీ తరఫున తీసుకుని షర్మిల వద్దకు త్వరలో వెళ్తారు అని అంటున్నారు. వైఎస్ షర్మిలకు ఏమి కావాలి ఆమె ఆలోచనలు ఏమిటి అన్నది తెలుసుకుంటారని అంటున్నారు. అంతే కాదు ఆమెను తిరిగి వైసీపీలోకి తీసుకుని వచ్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటారని అంటున్నారు.
షర్మిలను వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా పోటీ చేయించేందుకు కూడా వైసీపీ హై కమాండ్ సుముఖంగా ఉందని అంటున్నారు. ఆ విధంగా ఆమె రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ఆమెకు సంబంధిచిన ఆస్తుల విషయాలు ఏమైనా ఉంటే సానుకూలంగా పరిష్కరించడానికి కూడా ఆ కుటుంబ పెద్ద చొరవ చూపుతారు అని అంటున్నారు.
ఇక షర్మిల విషయం తీసుకుంటే ఆమె జగన్ కి సరిసమానంగా రాజకీయ దూకుడు చేస్తున్నారు. ఆ విధంగానే ఆమె ముందుకు వెళ్తున్నారు. ఈ విధంగా అన్నా చెల్లెలు రాజకీయ సమరం చేయడం వల్ల వైఎస్సార్ ప్రతిష్ట కూడా ఇందులో ఇమిడి ఉండడంతో అంతా ఇబ్బందిలో పడుతుందని ఊహిస్తున్నారు. దాంతో సాధ్యమైనంత వరకూ ఈ ఇష్యూని క్లోజ్ చేయాలని కూడా వైఎస్సార్ కుటుంబ హితైషులు భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
దాంతో షర్మిల వద్దకు వెళ్లే ఈ రాయబారం మీద సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. మరి వైసీపీ నుంచి వచ్చే రాయబారం పట్ల షర్మిల ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా ఆసక్తిని పెంచుతోంది. ఇంకో వైపు విజయమ్మ సైతం కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక వైఎస్సార్ అభిమానులు అయితే విపక్షాల ట్రాప్ లో చిక్కుకోకుండా వైఎస్సార్ ఫ్యామిలీ అంతా ఏకమైతే అది 2024 ఎన్నికల్లో వైసీపీకి లాభిస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఇంతకీ ఇది కేవలం ప్రచారమేనా లేక నిజంగా రాయబారం నడుస్తోందా అన్నది కూడా చర్చగా ఉంది.