Begin typing your search above and press return to search.

ఇంటరెస్టింగ్ : రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ...!

పైగా కాంగ్రెస్ పార్టీ అంతా ఒక్కటిగా ఉండాల్సిన తరుణం. దాంతో రేవంత్ రెడ్డిని నిన్నటిదాకా విమర్శించిన వైఎస్ షర్మిల ఇపుడు ఆయనను కలిశారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 5:20 PM GMT
ఇంటరెస్టింగ్ : రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ...!
X

వైఎస్ షర్మిల కాంగ్రెస్ మనిషి అయ్యారు. తెలంగాణాలో తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆమె హస్తం గూటికి చేరుకున్నారు. అంతే కాదు తెలంగాణాలో రాజకీయానికి స్వస్తి పలికి ఏపీ వైపు చూస్తున్నారు. దాంతో తెలంగాణాలో ఆమెకు రాజకీయంగా ప్రత్యర్ధులు అయితే లేరు అనుకోవాలి.

పైగా కాంగ్రెస్ పార్టీ అంతా ఒక్కటిగా ఉండాల్సిన తరుణం. దాంతో రేవంత్ రెడ్డిని నిన్నటిదాకా విమర్శించిన వైఎస్ షర్మిల ఇపుడు ఆయనను కలిశారు. నిజానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక షర్మిల అభినందనలు చెప్పారా లేదా అన్నది కూడా ఒక చర్చగా ఉంది.

అదే సమయంలో వైఎస్ షర్మిల తెలంగాణా కాంగ్రెస్ లో కొత్త ముఖ్యమంత్రులుగా భట్టి విక్రమార్కను ఉత్తం కుమార్ రెడ్డి వంటి వారిని కోరుకున్నారు. సరే అదంతా గతం గతహా. ఇపుడు ఆమె ఖద్దరు పార్టీ నేత కాబట్టి ఆ మర్యాదలు ప్రొటోకాల్స్ పాటించాలి. పైగా ఆమె సొంతింట కార్యక్రమం పెట్టుకున్నారు.

తన కుమారుడి వివాహ నిశ్చితార్ధ వేడుకను ఆమె జనవరి 18న నిర్వహిస్తున్నారు. వివాహం ఫిబ్రవరి 17న జరగనుంది. దీని కోసం ఆమె చాలా మందిని ఆహ్వానిస్తున్నారు. తన సోదరుడు ఏపీ సీఎం జగన్ ను ఆమె ఆహ్వానించారు. అలాగే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిని కూదా ఆమె కలసి ఆహ్వానించారు.

వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో జరగబోతోంది. కాంగ్రెస్ పెద్దలందరితో పాటు ఆమె చాలా మంది ప్రముఖులనే పిలుస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ కావడం పొలిటికల్ గా ఇంటరెస్టింగ్ అని అంటున్నారు. అది కూడా ఆమె కాంగ్రెస్ మనిషి అయ్యాక జరిగిన తొలి భేటీగా దీనిని చూడాల్సి ఉంది.