"భయపడుతున్నారా సర్?"... పీసీసీ చీఫ్ గా షర్మిల ఫస్ట్ డైలాగ్!
ఈ క్రమంలో... ఎనికే పాడు దగ్గర కాంగ్రెస్ పార్టీ ర్యాలీగా వెళ్తున్న వాహనాలను దారి మళ్లించారు పోలీసులు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు.
By: Tupaki Desk | 21 Jan 2024 8:31 AM GMTఏపీలో రసవత్తర రాజకీయానికి తెరలేచింది. ఇంతకాలం వైసీపీ వర్సెస్ టీడీపీ-జనసేన అన్నట్లుగా ఉన్న రాజకీయం కాస్తా ఇప్పుడు త్రిముఖ పోటీకి తెరలేచేలా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంతకాలం స్థబ్ధగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈ సమయంలో ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తూ విజయవాడలో ర్యాలీలో పాల్గొన్న వైఎస్ షర్మిలకు తాజాగా ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది!
అవును... ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో వైఎస్ షర్మిలకు తొలి షాక్ తగిలింది! ఇందులో భాగంగా... ఆమె ప్రయణిస్తున్న కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో... ఎనికే పాడు దగ్గర కాంగ్రెస్ పార్టీ ర్యాలీగా వెళ్తున్న వాహనాలను దారి మళ్లించారు పోలీసులు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు.
ఇందులో భాగంగా... తమ వాహనాలను డైవర్ట్ చేసినందుకు కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీతో పాటు ఇతర శ్రేణులు నిరసనగా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడిన షర్మిల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికరంగా స్పందించారు.
ఈ సందర్భంగా కారులో నుంచే మీడియాతో మాట్లాడిన షర్మిళ... కాంగ్రెస్ పార్టీని చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కావాలనే తమ కాన్వాయ్ ను దారి మళ్లించారని తెలిపారు. ఈ క్రమంలో... "భయపడున్నారా సర్?" అని షర్మిళ వ్యాఖ్యానించడం గమనార్హం.