Begin typing your search above and press return to search.

జగన్ గెలుపుపై హైకమాండ్ కు షర్మిళ ఇచ్చిన రిపోర్ట్ ఇదే..!

ఈ నేపథ్యంలో... ఏపీలో జగన్ గెలిచే ఎంపీ స్థానాలపై హస్తినలోని కాంగ్రెస్ హై కమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   31 May 2024 11:26 AM GMT
జగన్  గెలుపుపై హైకమాండ్  కు షర్మిళ ఇచ్చిన రిపోర్ట్  ఇదే..!
X

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా ఒకటే మాట.. ఒకటే చర్చ.. ఒకటే ప్రశ్న..! జూన్ 4న వెలువడనున్న ఫలితాల్లో విజయం ఎవరిని వరించబోతుంది అని! ఆ స్థాయిలో ఇప్పుడు ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంట నెలకొంది. పైగా జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలవ్వబోతుండటంతో ఈ టెన్షన్ మరింత పెరిగిందని చెబుతున్నారు. ఈ సమయంలో... కేంద్రంలోని ప్రధాన పార్టీల దృష్టి ఇప్పుడు ఏపీ ఫలితాలపై తీక్షణంగా ఉందని అంటున్నారు.

అవును... ఏపీలో అధికారం దక్కేదెవరికి.. ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచే దేవరు అనే విషయాలపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తుంది. ప్రధానంగా జాతీయ స్థాయిలోనూ ఏపీ ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోందని అంటున్నారు. ఇక్కడ అధికార వైసీపీ అటు ఎన్డీయే కూటమిలో కానీ, ఇటు ఇండియా కూటమిలో కానీ లేకపోవడం ఈ ఆసక్తికి ప్రధాన కారణం అని చెబుతున్నారు.

ఏపీలో ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీతో టీడీపీ, జనసేన జత కట్టాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కమ్యునిస్టులతో కలిసి విడిగా పోటీ చేసింది! అయితే జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేశారు. ఇదే సమయంలో గెలుపుపై పూర్తి ధీమాగా ఉన్నారు. 151 ఎమ్మెల్యే 22 ఎంపీ స్థానాలకంటే ఎక్కువ వస్తాయని బల్లగుద్ది చెబుతున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలో... ఏపీలో జగన్ గెలిచే ఎంపీ స్థానాలపై హస్తినలోని కాంగ్రెస్ హై కమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో జగన్ గెలుచుకునే ఎంపీ స్థానాలపై నివేదిక ఇవ్వాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళను కాంగ్రెస్ హస్తిన పెద్దలు కోరినట్లు తెలుస్తుంది. దీంతో షర్మిళతో పాటు.. ఏపీలో హై కమాండ్ కు అత్యంత సన్నిహిత నేత ఒకరు కలిసి ఏపీలో రాబోయే అవకాశం ఉన్న ఫలితాలపై రిపోర్ట్ ఇచ్చారని తెలుస్తుంది.

ఈ క్రమంలో ఏపీ ఫలితాలపై తన అంచనాలను పార్టీ పెద్దలకు వీరిద్దరూ నివేదించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఏపీలో జగన్ వైపే సానుకూలత ఉందని.. గతంలో వచ్చిన ఎంపీ స్థానాలకు ఒకటి రెండు స్థానాలు అటు ఇటుగా ఫలితాలు వచ్చే అవకాశాన్ని కొట్టివేయలేమని నివేదించినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఇండియా కూటమికి జగన్ మద్దతు కూడా ఉండదని నొక్కి చెప్పినట్లు సమాచారం.

కాగా... ఈసారి జాతీయ స్థాయిలో అటు ఎన్డీయే - ఇటు ఇండియా కూటముల పరిస్థితి వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఏమీ లేదని.. ఇద్దరి మధ్యా టఫ్ ఫైట్ నడుస్తుందని.. ఈ సమయంలో ఏ కూటమికీ చెందని పార్టీలకు ఈసారి కేంద్రంలో ఫుల్ డిమాండ్ ఉండొచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి! దీంతో... ఏపీ నుంచి వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే మాత్రం... కేంద్రంలో చక్రాలు గట్రా తిప్పే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.