Begin typing your search above and press return to search.

'రాజీనామా చెయ్యండి' జగన్ ను స్ట్రాంగ్ గా తగులుకున్న షర్మిల!

మరోపక్క.. 10శాతం సీట్లు కూడా రాకుండా ప్రధానప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదని ప్రభుత్వం వైపునుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   28 July 2024 9:56 AM GMT
రాజీనామా  చెయ్యండి  జగన్  ను స్ట్రాంగ్  గా తగులుకున్న షర్మిల!
X

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేని సంగతి తెలిసిందే. ఆ హోదా ఇవ్వాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ హోదావల్ల అసెంబ్లీలో చంద్రబాబుకు ఎంత సమయం ఇస్తారో.. అనంతరం, తనకూ అంతే సమయం ఇవ్వాల్సి ఉంటుందని, ఫలితంగా ప్రజల తరుపున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి ఉంటుందని జగన్ ఇటీవల వెల్లడించారు.

మరోపక్క.. 10శాతం సీట్లు కూడా రాకుండా ప్రధానప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదని ప్రభుత్వం వైపునుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే... అసెంబ్లీలో ప్రజల తరుపున తన వాయిస్ వినిపిస్తానంటూ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో... జగన్ చేస్తున్న ఈ ప్రయత్నంపై వైఎస్ షర్మిళ రియాక్ట్ అయ్యారు.

అవును... ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేతా హోదా కావాలని, అప్పటివరకూ అసెంబ్లీకి వెళ్లనన్నట్లుగా జగన్ ఆలోచిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ షర్మిళ తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా... "సిగ్గు సిగ్గు... జగన్ గారు.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతామనడం మీ అజ్ఞానానికి నిదర్శనం" అంటూ ట్వీట్ చేశారు షర్మిళ.

ఇదే సమయంలో... ఇంతకు మించిన పిరికితనం.. చేతకానితనం.. అహంకారం ఎక్కడా కనబడవు.. వినబడవు అంటూ ఘాటుగా రియాక్ట్ అయిన షర్మిల... మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు జగన్ మోహన్ రెడ్డిగారూ అంటూ మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే... మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందంటూ కామెంట్ చేశారు.

అనంతరం... అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలాకోరుతనం అంటూ ఆమె స్పందించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నాట్ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ అని కామెంట్ చేసిన షర్మిళ... ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక.. మీడియా ముందు సొంతడబ్బా కొట్టుకోవడానికా అంటూ ప్రశ్నించారు.

ఇక ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని.. రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని.. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే.. తాపీగా ప్యాలెస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది అని షమిళ సూచించారు. ఇదే క్రమంలో.. గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే... బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు.. ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు.. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు.. మీరు ఎమ్మెల్యే హోదాకు అర్హులు కారు.. వెంటనే రాజీనామా చేయండి అని షర్మిళ డిమాండ్ చేశారు. అయితే... ఇదంతా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అంటూ షర్మిల చివర్లో ముక్తాయింపు ఇవ్వడం గమనార్హం!