షర్మిల వ్యాఖ్యలు బూమరాంగ్.. మాట మార్చేసిన కాంగ్రెస్ చీఫ్!
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో కర్నూలులో అభివృద్ధి కుంటు పడిందని.. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 21 April 2024 10:38 AM GMTమనం ఏం చెప్పేస్తే.. అది జనాలు నమ్మేస్తారు అనుకుంటే పొరపాటే. జనాలు ఒకప్పుడు ఎలా ఉన్నా.. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం.. చైతన్యవంతమైన వార్తలు.. విశేషాలు.. యూట్యూబ్‌వంటి గత చరి త్రను నిమిషాల వ్యవధిలో కళ్ల ముందు ఉంచే యాప్‌లు అందుబాటులోకి రావడంతో నాయకులు చేస్తున్న ప్రసంగాల్లోని లోపాలను.. గతంలో వారు ఏమన్నారు? ఏం చేశారన్న వాదనను కూడా.. ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌షర్మిల విషయంలోనూ ఇదే జరిగింది.
వైఎస్ షర్మిల.. ఆదివారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో కర్నూలులో అభివృద్ధి కుంటు పడిందని.. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను పూర్తిచే స్తామన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆ ఆశయాలను పూర్తి చేయలేదని విమర్శిం చారు. అంతేకాదు.. ఈ సందర్భంగా మూడురాజధానుల అంశాన్ని ప్రస్తావించారు.
ఇక్కడే షర్మిల పెద్ద పొరపాటు చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులు కడతానన్న జగనన్న ఒక్కటైనా కట్టారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. కర్నూలును న్యాయరాజధాని చేస్తానన్న జగనన్న చేశాడా? కనీసం పునాదులు అయినా వేశాడా? అని ప్రశ్నించారు. సాధారణంగా.. జనం నుంచి లేదు.. లేదు.. అని సమాధానం రావాలి. అలానే వచ్చింది. అయితే. మరికొందరు మాత్రం అనూహ్యంగా గత వీడియోలను తీసి.. ప్రదర్శించారు. ఇది జనం గోలలో కొట్టుకుపోయినా.. ఒకరిద్దరు నాయకులు గుర్తించారు. వెంటనేషర్మిలకు ఏ సైగ చేశారో ఏమో.. ఆమె రాజధానుల విషయాన్ని మానేసి.. వైఎస్సార్ గురించి ప్రస్తావించారు.
ఏం జరిగిందంటే..
షర్మిల మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్న సమయంలో ముఖ్యంగా కర్నూలును న్యాయ రాజధానిని చేస్తామన్న విషయాన్ని ప్రస్తావించిన సమయంలో ఒకరిద్దరు యువకులు.. గతంలో ఆమె అమరావతికి మద్దతు పలికిన మాటలను పోన్లలో వినిపించారు. అంతేకాదు.. మూడురాజధానులపై ఇటీవల కర్నూలులో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా వినిపించారు. మూడు రాజధానులకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని.. న్యాయపరమైన పోరాటా లు చేస్తున్నారని అందుకే ఆలస్యం అవుతోందని జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలనే కొందరు ప్రసారం చేయడంతో షర్మిల తన ప్రసంగంలో కొత్త విషయాలను ప్రస్తావించారు.