Begin typing your search above and press return to search.

ఫిబ్రవరి 17న షర్మిల కొడుకు పెళ్లి.. ట్విస్టు ఏమంటే!

రాజకీయ పరిస్థితుల్ని పక్కన పెడితే.. ఆమె కుమారుడు రాజారెడ్డి పెళ్లి వ్యవహారం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Dec 2023 6:58 AM GMT
ఫిబ్రవరి 17న షర్మిల కొడుకు పెళ్లి.. ట్విస్టు ఏమంటే!
X

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాలపట్టిగా పేరున్న షర్మిల గురించి తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నించి.. తప్పటడుగులు వేసి మొత్తంగా రాజకీయాల్లో ఫెయిల్ అయిన పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటతానని చెప్పిన ఆమె.. చివరకు పోటీ కూడా చేయలేని పరిస్థితి. రాజకీయ పరిస్థితుల్ని పక్కన పెడితే.. ఆమె కుమారుడు రాజారెడ్డి పెళ్లి వ్యవహారం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారటం తెలిసిందే.


తాజాగా వీరి పెళ్లికి చెందిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఫిబ్రవరి 17న షర్మిల కొడుకు పెళ్లి డిసైడ్ అయినట్లుగా విశ్వసనీయ సమాచారం. రాజస్థాన్ లోని జోథ్ పూర్ ఉమేద్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు.. కొందరు సన్నిహితుల మధ్య వీరి వివాహం జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం విజయమ్మ.. షర్మిల ఇరువురు అమెరికాలోని రాజారెడ్డి వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. జనవరి రెండు మూడు వారాల్లో ఏదో ఒక రోజు వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే.. వేదిక ఇంకా డిసైడ్ చేయలేదని చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెళ్లి కుమార్తెకు సంబంధించిన వివరాలు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ తప్పుగా వస్తున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు పెళ్లి కుమార్తె ప్రియ అట్లూరికి చట్నీస్ హోటల్స్ కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. చట్నీస్ అధినేత అట్లూరి ప్రసాద్ కు అసలు ఆడపిల్లలే లేరని.. ఉన్నది ఒక్కడే కొడకని అతను చాలా చిన్న కుర్రాడని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రియ తండ్రి అట్లూరి శ్రీనివాస్ కు కూడా చట్నీస్ సంస్థతో సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రియ అమెరికాలో పుట్టి పెరిగిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆమె తండ్రి కొంతకాలం హైదరాబాద్ లో ఉండి.. ఆ తర్వాత ఉద్యోగంలో భాగంగా అమెరికాకు షిఫ్టు అయ్యారని తెలుస్తోంది. ఎవరు పుట్టించారో కానీ.. చట్నీస్ తో లింకును.. అందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేస్తున్నారు.