Begin typing your search above and press return to search.

షర్మిలకు ఇంతకూ డిపాజిట్ వస్తుందా...?

వైఎస్ షర్మిలకు ఆమె పోటీ చేయబోయే పాలేరు అసెంబ్లీ సీటులో డిపాజిట్ అయినా వస్తుందా అన్న దాని మీద ఏపీలో పెద్ద ఎత్తున బెట్టింగ్స్ అవుతున్నాయని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:15 AM GMT
షర్మిలకు ఇంతకూ డిపాజిట్ వస్తుందా...?
X

వైఎస్సార్టీపీ పేరుతో పార్టీని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల రాజకీయం ఎలా ఉండబోతోంది, ఏమి జరగబోతోంది అన్నది మరో రెండు నెలలలో తేలబోతోంది. ఆమె రాజకీయంగా సరైన వ్యూహాలు లేక ఇబ్బంది పడుతోంది అన్న విశ్లేషణలు ఇంతకాలం వినిపించాయి. ఇపుడు దానికి తగినట్లుగానే ఆమె వ్యవహార శైలి కూడా ఉంది అని అంటున్నారు. తెలంగాణాలో దిగ్గజ పార్టీలు హోరా హోరీగా పోరాడుతూ ఉంటే వైఎస్సార్టీపీని ఒంటరి పోటీకి నిలిపిన షర్మిల రాజకీయ భవితవ్యం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

వైఎస్ షర్మిలకు ఆమె పోటీ చేయబోయే పాలేరు అసెంబ్లీ సీటులో డిపాజిట్ అయినా వస్తుందా అన్న దాని మీద ఏపీలో పెద్ద ఎత్తున బెట్టింగ్స్ అవుతున్నాయని తెలుస్తోంది. ఆమె పాలేరు ఎన్నికల్లో కనీసంగా కూడా పోటీ ఇవ్వలేరని, డిపాజిట్లు కూడా రావు అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అదే టైం లో షర్మిల పాలేరు నుంచి తప్పనిసరిగా గెలిచి తీరుతుందని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు.

ఇక పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే గ్రౌండ్ లెవెల్ లో చర్చ చూసుకుంటే ఖమ్మం ఎంపీగా ఒకనాడు పనిచేసిన సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇపుడు పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి షర్మిలకు వైఎస్సార్టీపీకి కనీసంగా ఓట్లు వస్తాయా అన్నది చర్చగా ఉంది. అమెకు డిపాజిట్లు కూడా రావు అని అంటున్నారు. డిపాజిట్లు తెచ్చుకోవడం కష్టం అవుతుందని అంటున్నారు.

అదే పొంగులేటి ప్లేస్ లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే షర్మిలకు డిపాజిట్లు అయినా వచ్చేవి అన్న చర్చ కూడా ఉందిట. ఇలా ఎందుకు అంటే కమ్మ సామాజికవర్గానికి చెందిన తుమ్మల కంటే రెడ్డి సామాజికవర్గం షర్మిలకు మొత్తంగా నిలబడి పనిచేస్తుంది అని అంటున్నారు. ఈ రకమైన సామాజిక విభజన వల్ల తుమ్మల క్యాండిడేట్ అయితే షర్మిలకు డిపాజిట్లకు సైతం అవకాశాలు ఉండేవని అంటున్నారు.

మొత్తానికి షర్మిల ఎంతో ఆశపడి బరిలోకి దిగుతున్న పాలేరు సీటు విషయంలో ఆమె గెలుపు సంగతి పక్కన పెట్టి డిపాజిట్లు అయినా వస్తాయా రావా అన్న దాని మీదనే చర్చ సాగడం రాజకీయంగా షర్మిల భవిష్యత్తుని చాటి చెబుతోంది అని అంటున్నారు. ఇక షర్మిల రెండవ సీటుగా మిర్యాలగూడ నుంచి పోటీ చేయబోతున్నారు అని టాక్ నడుస్తోంది.

ఈ సీటు గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదని అవతల క్యాండిడేట్ ఎవరైనా సరే షర్మిలకు డిపాజిట్లు రావు ఇది పక్కా అని అంటున్న వారు ఉన్నారు. మొత్తానికి షర్మిల రాజకీయం ఆమె గెలుపు ఆమెకు డిపాజిట్లు దక్కడం వంటి విషయాల్లో చూస్తే ఎక్కువ మంది డిపాజిట్లు రావు అనే పందేలు కాస్తున్నారు ఆమె తెలంగాణా రాజకీయాల్లో ఎక్కడ ఉన్నారో అర్ధం చేసుకోవాలని అంటున్నారు.

పందేలు కాయడం కూడా ఒక రకంగా ఓపీనియన్ పోల్ లాంటిదే అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది ఏ వైపు ఉన్నారు అన్నది తెలుస్తుంది. షర్మిల రాజకీయం ఆమె చూపించే పోరాట పటిమ లోకల్ గా ఉండే పరిస్థితులు అన్నీ కూడా కలిపి వారు విశ్లేషించి మాత్రమే పందెం కడతారు. అలా చూస్తే కనుక షర్మిల గెలవదు అని పందేలు కాస్తున్న వారే ఎక్కువగా ఉన్నారంటే డిసెంబర్ 3 ఫలితాల వరకూ ఆగాల్సిన అవసరం లేదా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.