Begin typing your search above and press return to search.

ప్రియుడి ఆత్మతో పెళ్లికి సిద్ధమైన యువతి... కామెంట్లు వైరల్!

అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం ఆత్మతో వివాహం..! పైగా ఇది వారికి వేళ ఏళ్ల నుంచి ఉన్న సాంప్రదాయమంట!

By:  Tupaki Desk   |   27 July 2024 2:30 AM GMT
ప్రియుడి ఆత్మతో పెళ్లికి సిద్ధమైన యువతి... కామెంట్లు వైరల్!
X

సమాజంలోనూ, చరిత్రలోనూ ఎన్నో రకాల పెళ్లిల్లు ఉన్నాయి! ఇందులో ప్రధానంగా పెద్దలు కుదిర్చిన వివాహాలు, ప్రేమ వివాహాలు, బలవంతపు వివాహాలు, గాంధర్వ వివాహాలు, వేధింపుల వివాహాలు వంటివి ఎన్నో రకాలున్నాయని అంటుంటారు! అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం ఆత్మతో వివాహం..! పైగా ఇది వారికి వేళ ఏళ్ల నుంచి ఉన్న సాంప్రదాయమంట!

అవును... ప్రేమించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో ముగ్గురు ప్రాణాలను కాపాడగలిగింది కానీ... పాపం ప్రియుడ్ని కోల్పోయింది ఓ యువతి. ఈ సమయంలో అతడి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నట్లుంది. తమ ప్రేమకు భౌతికంగా శరీరంతో పనిలేదు ఆత్మీయంగా ఆత్మ చాలు అని నిర్ణయించుకున్నట్లుంది.. పెళ్లికి సిద్ధమైంది. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశం అవుతుంది!

వివరాళ్లోకి వెళ్తే... తైవాన్ లో "యు"అనే యువతి ఈనెల 15న జరిగిన కారు ప్రమాదంలో తన ప్రియుడిని కోల్పోయింది. ఈ సమయంలో ముగ్గురుని కాపాడగలిగింది కానీ.. అతడిని కాపాడలేకపోయింది. ఈ క్రమంలో... అతడిని రక్షించలేకపోయినందుకు తీవ్ర ఆవేదన చెందింది. ఈ సమయంలో.. ఆమె ప్రేమ, అతడి తల్లి ఒంటరైపోయిందని భావించిన యువతి సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది!

ఇందులో భాగంగా తన ప్రియుడి ఆత్మను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుందట. అయితే... ఇలా ఆత్మతో వివాహం అనే విషయం ఇదే ఫస్ట్ టైం కాదని.. ప్రపంచానికి ఫస్ట్ టైం కావొచ్చు కానీ.. ఈ సంప్రదాయం చైనాలో మూడు వేల ఏండ్ల నాటి నుంచీ ఉందని చెబుతున్నారు. ఈ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారిని వివాహం చేసుకుంటే.. వారి ఆత్మ శాంతిస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారట.

ఈ వివాహానికి సంబంధించిన విషయం వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఈ "యు"అనే యువతి కథ నెట్టింట వైరల్ గా మారుతోంది. ఈ వ్యవహారంపై చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ రియక్ట్ అవుతున్నారు.. ఇట్స్ ట్రూ లవ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.