Begin typing your search above and press return to search.

పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌... ఇమ్రాన్ ఖాన్‌ టీం?

ఈ క్రమంలో ప్రధానిగా పీఎంఎల్‌ - ఎన్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌, అధ్యక్షుడిగా పీపీపీ కో-ఛైర్మన్‌ ఆసిఫ్‌ జర్దారీ బాధ్యతలు చేపడతారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 5:08 AM GMT
పాక్‌  ప్రధానిగా షెహబాజ్‌  షరీఫ్‌... ఇమ్రాన్  ఖాన్‌  టీం?
X

పాకిస్థాన్‌ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ), పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ - నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) ల మధ్య ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధానిగా పీఎంఎల్‌ - ఎన్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌, అధ్యక్షుడిగా పీపీపీ కో-ఛైర్మన్‌ ఆసిఫ్‌ జర్దారీ బాధ్యతలు చేపడతారని తెలుస్తుంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్ (పీఎంఎల్‌-ఎన్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయని పార్టీ నాయకులు తెలిపారు. ఇదే సమయంలో... షెహబాజ్ షరీఫ్ మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని ప్రకటించారు. ఈ మేరకు ఈ విషయాన్ని పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో తెలిపినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

ఇదే సమయంలో పీపీపీ కో-ఛైర్మన్ ఆసిఫ్ జర్దారీ తిరిగి దేశ రాష్ట్రపతి అవుతారని ప్రకటించారు. ఈ సందర్భంగా పీపీపీ, పీఎంఎల్‌-ఎన్ పార్టీలు మ్యాజిక్ ఫిగర్ ను సాధించాయని, అవి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని బిలావల్ విలేకరులతో అన్నారు. ఇదే సమయంలో... మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ మద్దతుగల అభ్యర్థులు, సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని సాధించడంలో విఫలమయ్యాయని తెలిపారు.

ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ... చర్చలు సానుకూలంగా ముగిసాయని.. ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పీపీపీ, పీఎంఎల్-ఎన్ లు సిద్ధంగా షెహబాజ్ షరీఫ్ నొక్కిచెప్పారు.

కాగా... జాతీయ అసెంబ్లీ ఎన్నికలలో, స్వతంత్ర అభ్యర్థులు పాకిస్తాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ పార్టీ మద్దతుతో మెజారిటీ 93 జాతీయ అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. ఇదే సమయంలో... పీఎంఎల్-ఎన్ 75 సీట్లు గెలుచుకోగా, పీపీపీ 54 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ కూడా 17 సీట్లను సాధించుకుంది. వాస్తవానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు గెలుచుకోవాలి.