Begin typing your search above and press return to search.

భారత్ లో బంగ్లా మాజీ ప్రధాని ఎప్పటి వరకూ ఉండనున్నారంటే..?

మరోపక్క బంగ్లాలో తాజాగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా బంగ్లా – భారత్ సరిహద్దుల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 6:09 AM GMT
భారత్  లో బంగ్లా  మాజీ ప్రధాని ఎప్పటి వరకూ ఉండనున్నారంటే..?
X

బంగ్లాదేశ్ ప్రస్తుతం సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో కొన్ని రోజులుగా అట్టుడుకుతున్న బంగ్లా వ్యవహారం పీక్స్ కి చేరింది. దీంతో.. ఆ దేశ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. ఆ దేశం విడిచి పెట్టి భారత్ కు షిఫ్ట్ అయ్యారు. ఈ సమయంలో ఆమె ఇక్కడ ఎన్ని రోజులు ఉండబోతున్నారు అనే విషయంలో సందిగ్దత నెలకొందని అంటున్నారు.

అవును... ప్రస్తుతం తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ కు వచ్చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. అయితే త్వరలో ఆమె భారత్ నుంచి లండన్ కు వెళ్లొచ్చనే వార్తలు వచ్చాయి. ఆమె యునైటెడ్ కింగ్ డమ్ లో రాజకీయ ఆశ్రయం కోసం అభ్యర్థించారని తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతానికి యూకే ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాలేదని అంటున్నారు. దీంతో... ఆమె భారత్ లో ఎన్ని రోజులు ఉండనున్నారనేది ఇంకా స్పష్టత రాలేదు.

అయితే బంగ్లాలో పరిస్థితులపై స్పందించిన యూకే విదేశాంగ కార్యదర్శి... బంగ్లాలో అల్లర్ల కారణంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణనష్టంపై ఐక్యరాజ్యసమితి నేతృతంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడ్డారు. అయితే... ఈ మేరకు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో హసీనాకు ఆశ్రయమిచే విషయాన్ని మాత్రం ప్రస్థావించకపోవడం గమనార్హం.

దీంతో... యూకే ప్రభుత్వం నుంచి షేక్ హసీనా రాజకీయ ఆశ్రయం పై అనుమతులు వచ్చే వరకూ ఆమె భారత్ లోనే ఉండనున్నారని అంటున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీ తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో హసీనాకు భారత్ సంస్థాగతంగా పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరోపక్క బంగ్లాలో తాజాగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా బంగ్లా – భారత్ సరిహద్దుల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్ బలగాలు మొహరించాయి. ఈ సమయంలో బంగ్లాదేశ్ లోని పరిణామాలపై చర్చించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇంకోవైపు బంగ్లాలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.

భారత్ - బంగ్లా ఒప్పందాల పరిస్థితి?:

బంగ్లాదేశ్ లో పరిస్థితులు చేజారిపోవడం, ఆ దేశ ప్రధాని హసీనా భారత్ లో తలదాచుకునేందుకు రావడం సంగతి అలా ఉంచితే... ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ తో చేసుకున్న ఒప్పందాల పరిస్థితి ఏమిటి.. ఈమె తర్వాత ఆ స్థానంలోకి ఖలీదా జియా వచ్చే అవకాశాలున్నాయని అంటున్న నేపథ్యంలో.. ఇది భారత్ కు కొత్త తలనొప్పి అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.

వాస్తవానికి భారత్ - బంగ్లా మధ్య ఇప్పటికే అనేక ఆర్థిక ఒప్పందాలు జరగడంతో పాటు పలు జల పంపకాల వివాదాలూ పరిష్కారమయ్యాయి. ఇదే సమయంలో... ఉగ్రవాదానికి వ్యతిరేకంగానూ హసీనా.. భారత్ తో కలిసి పనిచేశారు. మరి షేక్ హసీనా రాజీనామాతో మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలీదా జియా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఆమె భారత్ కు పూర్తిగా వ్యతిరేకంగానే పనిచేస్తారు. పైగా ఆమె పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి పక్కనున్న పాకిస్థాన్, చైనాలు అనుకూలంగా ఉంటాయి. పైగా ఈమె భారత్ బాయ్ కాట్ అంశాన్ని గతంలో తెరపైకి తెచ్చింది. దీంతో... హసీనా రాజీనామా అనంతరం ఖలీదా పగ్గాలు అందుకుంటే.. భారత్ కు తలనొప్పులు తప్పకపోవచ్చనే చర్చా తెరపైకి వచ్చింది.