Begin typing your search above and press return to search.

రోజులో ఒక్క షేరుతో ఆమెకు రూ.800 కోట్ల నష్టం

నిజానికి రాకేశ్ ఝున్ ఝున్ వాలాను సంపన్నుడిగా మార్చింది కూడా ఆ షేరే అన్న మాట వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   8 May 2024 7:30 AM GMT
రోజులో ఒక్క షేరుతో ఆమెకు రూ.800 కోట్ల నష్టం
X

ఒకే ఒక్క రోజులో.. ఒకే ఒక్క షేరు కారణంగా ఒక శ్రీమంతురాలికి జరిగిన నష్టం అక్షరాల రూ.800 కోట్లు. భారత వారెన్ బఫెట్ గా.. బిగ్ బుల్ దివంగత రాకేశ్ ఝున్ ఝున్ వాలా కుటుంబానికి ఒక్క షేరు కారణంగా భారీగా నష్టం వాటిల్లింది. నిజానికి రాకేశ్ ఝున్ ఝున్ వాలాను సంపన్నుడిగా మార్చింది కూడా ఆ షేరే అన్న మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఆ షేరు కారణంగా భారీ నష్టం వాటల్లింది. ఇంతకూ ఆ షేరు మరేమిటో కాదు.. టాటా సంస్థకు చెందిన టైటాన్.

టాటా గ్రూప్ నకు చెందిన టైటాన్ సంస్థ తాజాగా మార్చి త్రైమాసిక ఫలితాల్ని వెల్లడించింది. ఎన్నో అంచనాలు వ్యక్తమైన వేళ.. అందుకు భిన్నంగా వెల్లడైన ఫలితాలు నిరాశను మిగిల్చాయి. దీంతో షేరు ఒక దశలో 7.8శాతానికి పైగా నష్టపోయింది. ఈ కారణంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.22,527 కోట్లు పతనమైంది. దీంతో.. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.2.91 లక్షల కోట్లకు పరిమితమైంది.

ఈ కంపెనీలు రాకేశ్ ఝున్ ఝున్ వాలా సతీమణికి 5.35 శాతం షేర్లు ఉన్నాయి. వీటి విలువ రూ.16,792 కోట్లు. తాజాగా పతనమైన విలు కారణంగా వీటి విలువ రూ.15,986 కోట్లకు చేరుకుంది. దీంతో.. టైటాన్ షేర్ల కారణంగా ఒక్క రోజులో వారి కుటుంబం రూ.806 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్లైంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. 2022 - 2003లో రాకేశ్ ఝున్ ఝున్ వాలా టైటాన్ షేర్లను ఒక్కొక్కటి రూ.3 చొప్పున కొన్నారు.

ఆ తర్వాత నుంచి ఆ షేరు పైకి వెళ్లటమే తప్పించి కిందకు వచ్చింది లేదు. ఆయన కొన్న రేటుకు కొన్ని వేల రెట్లు ధర పెరిగింది. ఆయన మరణించే నాటికి టైటాన్ కంపెనీలో ఆయన వద్ద ఉన్న షేర్లు 5శాతంగా తేలింది. తనకు బాగా కలిసి వచ్చిన షేరుగా రాకేశ్ ఝున్ ఝున్ వాలా తరచూ ప్రస్తావించేవారు. రాకేశ్ మరణం తర్వాత ఆయన కుటుంబం పెద్దగా వార్తల్లోకి రాలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో రాకేశ్ సతీమణి రేఖా నివసించే బంగ్లాకు సముద్రాన్ని చూసే వెసులుబాటు ఉండేది. అయితే.. దానికి అడ్డంకి కల్పిస్తూ.. ఎదురుగా భారీ భవనాన్ని నిర్మించేందుకు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ప్లాన్ చేసింది. అయితే.. ఎవరికి తెలీకుండా.. ఆ పాత అపార్టుమెంట్ లోని అత్యధిక ఫ్లాట్లను (తొమ్మిది)సొంతం చేసుకోవటం ద్వారా.. భారీ భవన నిర్మాణానికి అడ్డుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె వార్తల్లోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ భారీగా షేరు విలువ నష్టపోయిన నేపథ్యంలో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారారు.