Begin typing your search above and press return to search.

కూతురు ట్రైనీ ఐఏఎస్... తుపాకీతో రైతులను బెదిరిస్తోన్న తల్లి!

ఇప్పుడు ఈమె తల్లి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   12 July 2024 4:35 PM GMT
కూతురు ట్రైనీ ఐఏఎస్...  తుపాకీతో రైతులను బెదిరిస్తోన్న తల్లి!
X

ఇటీవల మీడియాలో వచ్చిన అక్థనాల ప్రకారం... ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈమె అభ్యర్థిత్వంపై విచారణ జైపేందుకు కేంద్రం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిందంటే పరిస్థితి అర్ధం చేసుకొవచ్చు. ఆ కమిటీ రెండు వారల్లో నివేదిక ఇవ్వనుందని తెలుస్తుంది. ఇప్పుడు ఈమె తల్లి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఇటీవల వివాదాస్పదంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ.. ఆమె తల్లికి సంబంధించిన వ్యవహారం ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆమె నలుగురురైదుగురిని వెనకాల వేసుకుని, చేతిలో తుపాకీ పట్టుకుని రైతులను బెదిరిస్తోన్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం...!

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడింది. ఆమె తల్లి ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో కొంతమంది గ్రామస్థులను ఆమె తుపాకీ పట్టుకొని బెదిరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తనకు నిబంధనల పాఠాలు నేర్పొద్దంటూ ఆమె గ్రామస్థుల వద్దకు చేతిలో తుపాకీ పట్టుకుని దూసుకువచ్చింది.

అనంతరం కెమెరాను చూశాక టాపిక్ మార్చినట్లు కనిపించింది. అప్పుడు... నా పేరిట డాక్యుమెంట్స్ ఉన్నాయి.. మీదగ్గరున్న డాక్యుమెంట్స్ చూపించండి అని ఆమె ఓ వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో భూపత్రాలు, కేసూ కోర్టులో ఉన్నాయని ఆ వ్యక్తి స్పందించాడు. అయితే కోర్టు ఆర్డర్ చూపించాలని, తనకు నిబంధనలపై పాఠాలు నేర్పొద్దని ఆమె హెచ్చరించడం ఆ వీడియోలో వినిపించింది!

కాగా... పూజ తండ్రి దిలీప్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అయితే... ఆయన భారీగా కూడబెట్టారట. ఇందులో భాగంగా పూణె జిల్లాలో ముల్షీ తాలుకాలో 25 ఎకరాలు సంపాదించారని అంటారు. ఇదే సమయంలో పక్కనున్న రైతుల భూములనూ ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన కుటుంబంపై ఆరోపణలు ఉన్నయని అంటున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని అంటున్నారు.

మరోపక్క... ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పేరిట ఐదు ఫ్లాట్లు, రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయని మీడియాలో కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. వీటి విలువ సుమారు రూ.22 కోట్లని చెబుతున్నారు. అయితే ఆమె ఉద్యోగం పొందే సమయంలో ఈ విషయం దాచిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేంద్రం ఓ కమిటీని వేసింది. త్వరలో ఆ కమిటీ నిజనిర్ధారణ చేయనుంది.