పెళ్లి చేసుకుందాం రా... రాహుల్ గాంధీకి ఆఫరిచ్చిన హీరోయిన్!
ఒకానొక సమయంలో రాహుల్ గాంధీ పెళ్లి టాపిక్ లు ఎక్కువగా వినిపించేవి.. అయితే ఈ మధ్యాకాలంలో ఆ టాపిక్స్ పెద్దగా వైరల్ అవ్వడం లేదు.
By: Tupaki Desk | 6 Aug 2023 8:17 AM GMTఒకానొక సమయంలో రాహుల్ గాంధీ పెళ్లి టాపిక్ లు ఎక్కువగా వినిపించేవి.. అయితే ఈ మధ్యాకాలంలో ఆ టాపిక్స్ పెద్దగా వైరల్ అవ్వడం లేదు. ఈ సమయంలో తాజాగా హరియాణా మహిళా రైతులతో సోనియా విందు చేసిన సమయంలో... ఈ టాపిక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరోసారి రాహుల్ పెళ్లి మేటర్ తెరపైకి వచ్చింది.
సోనియా, ప్రియాంక, రాహుల్... హరియాణా మహిళలతో కలిసి భోజనం చేసిన సందర్భంగా ఓ మహిళ సోనియా గాంధీ చెవిలో.. "రాహుల్ కు పెళ్లి చేద్దామా?" అని అడగడం.. దీనికి ఆమె బదులిస్తూ.. "మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి" అని చెప్పడం.. దీంతో రాహుల్ నవ్వుతూ.. "అవుతుంది.. అవుతుంది" అని చెప్పడం.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ ఫేమ్, మోడల్, స్టార్ హీరోయిన్ షర్లిన్ చోప్రా ఈ విషయంపై స్పందించారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే షర్లిన్ కామెంట్స్, పిక్స్, వ్యవహార శైలి నిత్యం ఏదో విధంగా హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయని అంటుంటారు. ఈ సమయంలో ఏకంగా... రాహుల్ ను పెళ్లి చేసుకుంటానంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అవును... షెర్లిన్ చోప్రా కు రాహుల్ ను పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే "ఓకే" చెప్పేసింది. పనిలో పనిగా.. ఎందుకు చేసుకోకూడదని ఎదురు ప్రశ్నించింది. అదే సమయంలో ఒక కండీషన్ కూడా పెట్టడం గమనార్హం. అవును... రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ అంటుంది షెర్లిన్ చోప్రా.
అదేమిటంటే... రాహుల్ గాంధీతో పెళ్లి అయిన తరువాత తన ఇంటిపేరు మారకూడదంట. పెళ్లైన తర్వాత కూడా తన ఇంటి పేరు చోప్రాగానే ఉండాలంట. ఈ షరతు మినహా... రాహుల్ ని పెళ్లి చేసుకోవడానికి మరో అభ్యంతరం లేదని అంటుంది షెర్లిన్ చోప్రా.దీంతో.. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియోకు సంబంధించి పలు కామెంట్లు కనిపిస్తున్నాయి.
కాగా... భారత్ జోడో యాత్ర సందర్భంగా తనకు కాబోయే భార్య గురించి రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. తనకు కాబోయే భార్య తన నానమ్మ ఇందిర వంటి మంచి లక్షణాలున్న అమ్మాయి అయి ఉండాలని.. అమ్మ, నానమ్మలోని మిశ్రమ లక్షణాలుంటే మరీ మంచిదని వ్యాఖ్యానించారు.మరి రాహుల్ మనసులో ఉన్న ఈ అభిప్రాయాలు విన్నారో లేదో తెలియదు కానీ... షెర్లిన్ చోప్రా.. రాహుల్ కి కండిషన్స్ పెడుతూ ఇలా స్పందించారు.