Begin typing your search above and press return to search.

ఫంఖా బాబా అవతారమెత్తిన శిఖర్ ధావన్... వీడియో వైరల్!

నలుగురు వ్యక్తులు కుర్చీలో ఉన్న అతన్ని పైకి ఎత్తితే.. అతడు ఒంటిచేత్తో తిరుగుతున్న ఫ్యాన్ ని ఆపేస్తాడు.. తనను ఎత్తుకున్నవారికి బ్లెస్సింగ్స్ ఇస్తుంటాడు

By:  Tupaki Desk   |   23 Oct 2024 4:01 AM GMT
ఫంఖా బాబా అవతారమెత్తిన శిఖర్  ధావన్... వీడియో వైరల్!
X

గత కొన్ని రోజులుగా వేగంగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ ని ఒంటిచేత్తో ఆపే స్పెషల్ టాలెంట్ ఉన్న బాబాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. నలుగురు వ్యక్తులు కుర్చీలో ఉన్న అతన్ని పైకి ఎత్తితే.. అతడు ఒంటిచేత్తో తిరుగుతున్న ఫ్యాన్ ని ఆపేస్తాడు.. తనను ఎత్తుకున్నవారికి బ్లెస్సింగ్స్ ఇస్తుంటాడు!

దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోకి కనిపిస్తున్న కామెంట్లు ఇంతకు మించి వైరల్ గా ఉన్నాయి. ఇందులో భాగంగా... "మిక్సర్ గ్రైండర్ ని ఆపమని అడగండి" అని కనిపించిన ఓ కామెంట్ ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలో ఇదే టాలెంట్ ప్రదర్శిస్తూ శిఖర్ ధావన్ చేసి చూపించాడు.

అవును... టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మైదానంలోనూ, వెలుపలా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తిరుగుతున్న ఫ్యాన్ ని ఆపుతున్న ఫంఖా బాబా అవతారం ఎత్తాడు. దీనికి సంబంధించిన ఓ సరదా వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నాడు.

ఈ వీడియోలో శిఖర్ ధావన్ కుర్చీలో కూర్చుని ఉండగా.. అతన్ని ముగ్గురు వ్యక్తులు పైకి లేపారు. ఈ సమయంలో సీరియస్ లుక్ లో ఉన్న శిఖర్... తిరుగుతున్న ఫ్యాన్ ను ఆపేశాడు. ఈ సమయంలో ఎదురుగా పూనకం వచ్చి ఊగిపోతున్నట్లు కనిపించిన ఇద్దరు భక్తులను తాకి వారిని కంట్రోల్ చేసేస్తాడు.

ఆ ఫంఖా బాబా వీడియో కంటే ఇప్పుడు శిఖర్ ధావన్ వీడియో వైరల్ గా మారుతోంది! ప్రజల్లోకి రకరకాల బాబాబు ఎలా పుట్టుకొస్తారో జాగృతం చేసే క్రమంలో ధావన్ ఈ వీడియో విడుదల చేసినట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. ఏది ఏమైనా... ఇది సూపర్ అటెంప్ట్ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

కాగా.. ఈ ఏడాది 2024లో 38 ఏళ్ల శిఖర్ ధావన్ 12 ఏళ్ల అద్భుతమైన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.