బిట్ కాయిన్ బురిడీ... శిల్పాశెట్టి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
ఈ క్రమంలో తాజాగా వీరికి చెందిన 99 కోట్లరూపాయల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. దీనిలో కొంత నగదు కూడా ఉన్నట్టు సమాచారం.
By: Tupaki Desk | 18 April 2024 11:27 AM GMTబిట్ కాయిన్ బురిడీ కేసులో.. బాలీవుడ్ హీరోయిన్.. శిల్పాశెట్టి దంపతులపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వీరికి చెందిన 99 కోట్లరూపాయల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. దీనిలో కొంత నగదు కూడా ఉన్నట్టు సమాచారం.
ఏం జరిగింది?
బిట్ కాయిన్. కొన్నాళ్ల కిందట పెద్ద ఎత్తున దేశంలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం. బిట్ కాయి న్‌లలో పెట్టుబడులు పెడితే.. పెద్ద ఎత్తున లాభాల పంట పండుతుందన్న ఆశ చూపించి.. సాధారణ ప్రజలను మోసం చేసిన వ్యవహారం.. ఒకానొక దశలో కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కుదిపేసింది. దీనిపై కేంద్రం కూడా సీరియస్ అయి.. ఈ విషయాన్ని సీబీఐ.. తర్వాత ఈడీకి కూడా అప్పగించింది.
వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్- అనే సంస్థ గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్ పేరుతో ప్రజలను ఆకర్షించింది. ఇది ఏపీ, తెలంగాణల్లోనూ ప్రచారంలోకి వచ్చింది. ఇదేంటంటే.. బిట్‌కాయిన్లలో పెట్టబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయనేది ప్రకటన. ఇక్కడ బిట్ కాయిన్ అంటే. భౌతికంగా మనకు ఏమీకనిపించదు. జస్ట్ స్టాక్ మార్కెట్ మాదిరిగానే. అయితే.. దీనికినష్టాలు రావనే ప్రచారం చేశారు.
దీంతో హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ నగరాలకు చెందిన చదువుకున్న వారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెట్టారు. ఇలా.. వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. రూ. 6,600 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత లాభాల మాట దేవుడెరుగు. అసలు స్పందించడమే మానేసింది. ఈ విషయాన్ని బీజేపీ మంత్రి నితిన్ గడ్కరీ తొలి సారి బయటకు తీసుకువచ్చారు.
దీంతో కేంద్ర ప్రభుత్వం బిట్ కాయిన్ వ్యవహారాన్ని తొలుత సీబీఐ, తర్వాత ఈడీలకు అప్పగించింది. విచారణ జరిపిన ఈడీ.. ఈ వ్యవహారం వెనుక.. ఫ్రాచైజీగా ఉన్న శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాలపై కేసులు నమోదు చేసింది. తాజాగా.. వీరి ప్రమేయం ఉందని.. వీరు కూడా మోసంలో భాగస్వాములేనని.. గుర్తించి రూ99 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది.
ఇవీ. ఈడీ సీజ్ చేసినవి..
+ ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న రెసిడెన్సీ ఫ్లాట్
+ పూణేలోని ఓ నివాస బంగ్లా
+ ఈక్విటీ షేర్లు