సేన వర్సెస్ సేన... దసరా రోజు అసలు సిసలు సినిమా!!
ఇందులో... శివసేన (యూబీటీ) దాదర్ లోని శివాజీ పార్క్ వద్ద ర్యాలీ చేయనుండగా.. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ లో షిండే వర్గం సమావేశమవుతుంది.
By: Tupaki Desk | 12 Oct 2024 4:27 AM GMTఎవరు అవునన్నా కాదన్నా భారతదేశ రాజకీయాల్లో కులాలు, మతాలే కీలక భూమిక పోషిస్తుంటాయని అంటారు. ప్రధానంగా పెద్ద పండగలు వచ్చాయంటే.. ప్రజలను ఆకట్టుకొవడానికి ఆయన పార్టీలు చేసే కార్యక్రమాలు అత్యంత హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఆ కారక్రమాలను ఆయా పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి.
ఈ నేపథ్యంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న మహారాష్ట్రలో దసరా రోజు అత్యంత రసవత్తరమైన రెండు కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా... ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన.. ఉద్ధవ్ ఠాక్రే నేతృతంలోని శివసేన (యూబీటీ) లు మహారాష్ట్ర ఎన్నికల ముందు బలప్రదర్శనకు దిగాయి.
అవును.. షిండేకు నేతృత్వంలోని శివసేన.. ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీఇ) లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ తమ బలాన్ని ప్రదర్శించే లక్ష్యంతో శనివారం దేశ ఆర్థిక రాజధానిలో బలప్రదర్శనకు తెరలేపనున్నాయి. ఇందులో భాగంగా... ముంబైలో భారీగా దసరా ర్యాలీలు నిర్వహించనున్నాయి.
ఇందులో... శివసేన (యూబీటీ) దాదర్ లోని శివాజీ పార్క్ వద్ద ర్యాలీ చేయనుండగా.. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ లో షిండే వర్గం సమావేశమవుతుంది. ఈ రెండు ర్యాలీలకు సంబంధించిన టీజర్లు ఇప్పటికే విడుదలయ్యి హల్ చల్ చేస్తున్నాయి. ఇక నేడు జరిగే రెండు బలమైన దసరా ర్యాలీల్లో అసలు సిసలు సినిమా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటికే విడుదలైన షిండే టీజర్ లో కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు! ఇక శివసేన (యూబీటీ) టీజర్ మహారాష్ట్ర గర్వాన్ని కాపాడటంపై దృష్టి పెడుతూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ద్రోహులు అని విమర్శించింది. ఇక ఈ ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే భారతీయ జనతాపార్టీని లక్ష్యంగా చేసుకుని చీల్చి చెండాడే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి!
వాస్తవానికి గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ రెండు వేదికల ప్రాంతాలు బురదమయంగా మారాయి. అయినప్పటికీ ర్యాలీ విషయంలో తగ్గేదేలేదని.. అనుకున్నట్లుగానే తమ ర్యాలీ సాగుతుందని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. మరోపక్క ఆజాద్ మైదాన్ కు సుమారు 2 లక్షల మంది హాజరవుతారని షిండే వర్గం అంచనా వేస్తోంది.
కాగా... దసరా ర్యాలీలు శివసేనకు కీలకమైన సంప్రదాయంగా ఉన్నాయి. ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే నాయకత్వంలో 1960 నుంచి శివాజీ పార్క్ లో ఈ కార్యక్రమం జరిగేది. అయితే... 2022లో పార్టీ చీలిక తర్వాత... ఉద్ధవ్ నేతృత్వంలోని వర్గం శివాజీ పార్క్ లోనే ర్యాలీని కొనసాగిస్తుండగా.. షిండే నేతృత్వంలోని శివసేన ఆజాద్ మైదానానికి మారింది!