Begin typing your search above and press return to search.

మనసు చెప్పిందని మూడు పెళ్లిలు చేసుకున్నావా?

ఇండియన్‌ టెన్నీస్ స్టార్‌ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్‌ మాలిక్‌ ఇటీవల మూడవ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   30 Jan 2024 6:09 AM GMT
మనసు చెప్పిందని మూడు పెళ్లిలు చేసుకున్నావా?
X

ఇండియన్‌ టెన్నీస్ స్టార్‌ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్‌ మాలిక్‌ ఇటీవల మూడవ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ పాకిస్తాన్ క్రికెటర్ వరుసగా పెళ్లిలు చేసుకోవడం పట్ల ఆయన అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాతో పాటు పాక్‌ లో కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


ఇటీవల సనా జావేద్ ను మూడో వివాహం చేసుకున్న షోయబ్‌ మాలిక్ తాజాగా ఒక సందర్భంగా మాట్లాడుతూ... మీ మనసు ఏది చెబితే అదే చేయాలి. మీ మనసుకు నచ్చింది కాకుండా జనాలు ఏమనుకుంటారో అని మరోటి చేయడం వల్ల మీకే నష్టం. జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించవద్దు.

మనం తీసుకునే నిర్ణయాన్ని జనాలు అర్థం చేసుకోవడానికి కచ్చితంగా 10 నుంచి 20 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు మనం ఊరికే ఉండలేం కదా. అందుకే జనాల గురించి ఆలోచించకుండా మనసుకు ఎప్పుడు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయడం ఉత్తమం అన్నట్లుగా షోయబ్‌ పేర్కొన్నాడు.

షోయబ్‌ వ్యాఖ్యలను నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. నీ మనసు చెప్పిందని మూడు పెళ్లిలు చేసుకున్నావా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మనసు చెప్పింది కదా అని ఇతరులను కూడా మళ్లీ మళ్లీ పెళ్లిలు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నావా అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.