Begin typing your search above and press return to search.

పని గంటల పెంపు చర్చ వేళ.. లోక్ సభలో మంత్రిగారి జవాబు ఇదే

పని గంటల పెంపుపై కేంద్రం ఏమైనా ఆలోచిస్తుందా? దీనిపై ఎలాంటి కసరత్తు జరుగుతోంది? అన్న ప్రశ్నను కేంద్ర కార్మిక.. ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే బదులిచ్చారు.

By:  Tupaki Desk   |   4 Feb 2025 4:19 AM GMT
పని గంటల పెంపు చర్చ వేళ.. లోక్ సభలో మంత్రిగారి జవాబు ఇదే
X

వారానికి కనీసం 70 గంటలు పని చేయాలని ఒక కార్పొరేట్ దిగ్గజం వ్యాఖ్యానిస్తే.. అదేం సరిపోతుంది? కనీసం 90 గంటలైనా పని చేయరా? భార్యల్ని చూడటం మానేసి.. ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చి గంటల తరబడి పని చేయాలన్న ధ్యాస పెరగాలన్న హితవులు.. ఇలాంటి వ్యాఖ్యలు తప్పన్న వ్యాఖ్యలు.. ఇలా మొత్తంగా ప్రైవేటు ఉద్యోగులు వీలైనంత ఎక్కువ సమయాన్ని ఆఫీసుల్లోనే వెచ్చించాలన్న వ్యాఖ్యల నేపథ్యంలో లోక్ సభలో ఆసక్తికర ప్రశ్న ఒకటి వచ్చింది.

పని గంటల పెంపుపై కేంద్రం ఏమైనా ఆలోచిస్తుందా? దీనిపై ఎలాంటి కసరత్తు జరుగుతోంది? అన్న ప్రశ్నను కేంద్ర కార్మిక.. ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే బదులిచ్చారు. లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆమె.. పని గంటల పెంపు నిర్ణయం ఏమీ లేదని స్పష్టం చేశారు. కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి పరిధిలో కార్మిక చట్టాల్నిఅమలు చేస్తాయన్నారు.

ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఆయా రాష్ట్రాల షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టుల ద్వారా పని గంటలు.. ఓవర్ టైం సహా వర్కింగ్ పరిస్థితులను నియంత్రిస్తాయన్న ఆమె.. ఒక వ్యక్తి వారానికి 60 గంటలకు పైగా పని చేస్తే.. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపొచ్చన్న విషయం ఇటీవల వెల్లడైన ఆర్థిక సర్వే కూడా పేర్కొన్నట్లుగా గుర్తు చేవారు. రోజుకు పన్నెండు అంతకు మించి కూర్చొని పని చేసే వారు తీవ్రమైన నిరాశ.. నిస్ప్రహ లేదంటే మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లుగా పేర్కొన్న వైనం తెలిసిందే. ఇలాంటి వేళ.. పని గంటల పెంపు అంశం ఏమీ తమ వద్ద లేదని చెప్పటం ద్వారా.. ప్రభుత్వం పాత పని గంటల విధానానికే కట్టుబడి ఉందన్న విషయం స్పష్టమైందని చెప్పాలి.