వార్న్ గదిలో సె*క్స్ ట్యాబ్లెట్లు.. చనిపోయిన మూడేళ్లకు సంచలనం
క్రికెట్ లో వార్న్ ఎంత ప్రతిభావంతుడో.. అంతకుమించి వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 30 March 2025 6:30 PMసరిగ్గా మూడేళ్ల కిందట ప్రపంచ క్రికెట్ ఒక్కసారిగా షాక్ కు గురైంది.. స్పిన్ లో అద్భుతం అంటే అతడే అనేంతగా.. ఇకముందు కూడా ఎవరూ అతడికి సాటి రారు అనేంతగా పేరు తెచ్చుకున్న ఓ గొప్ప చాంపియన్ ఆకస్మికంగా చనిపోయాడు. అతడే షేన్ వార్న్. ఈ ఆస్ట్రేలియా దిగ్గజం 52 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని వీడి వెళ్లడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
క్రికెట్ లో వార్న్ ఎంత ప్రతిభావంతుడో.. అంతకుమించి వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఉన్నాయి. అతడి వివాహేతర సంబంధాలు, ఇతర అలవాట్లు చాలా సంచలనం రేపాయి. ఆస్ట్రేలియాకు 15 ఏళ్లు ఆడిన వార్న్.. మధ్యలో ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు కూడా. అయినా ఇవేమీ వార్న్ గొప్పదనాన్ని కించిత్ కూడా తగ్గించలేదు.
వ్యక్తిగత ప్రవర్తన, వివాదాల కారణంగా ఆస్ట్రేలియాకు కెప్టెన్ కాలేకపోయిన వార్న్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి ఎడిషన్ (2008)లోనే సంచలనం రేపాడు. సాధారణ ఆటగాళ్లతో కూడిన రాజస్థాన్ రాయల్స్ ను చాంపియన్ గా నిలిపాడు.
టెస్టుల్లో 708, వన్డేల్లో 293 వికెట్లు తీసిన గొప్ప రికార్డులున్న వార్న్.. 2022 మార్చి 4న థాయ్ లాండ్ లోని తన విల్లాలో గుండెపోటుతో చనిపోయాడు. ఎక్కడి ఆస్ట్రేలియా..? ఎక్కడి థాయ్ లాండ్? అని అప్పట్లో అనేక అనుమానాలు వచ్చాయి. వార్న్ వంటి వాడు ఇంత దారుణంగా చనిపోవడమా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
తాజాగా వార్న్ మరణం వెనుక ఉన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వార్న్ చనిపోయిన సమయంలో ఆయన విల్లాలో సెక్స్ సామర్థ్యానికి సంబంధించిన ఔషధ బాటిల్ ఉందట. అయితే, దానిని తొలగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని థాయ్ లాండ్ సీనియర్ పోలీసు అధికారి చెబుతున్నారు. వార్న్ గదిలో ఆ ఔషధ బాటిల్ తో పాటు వాంతులు, రక్తపు మరకలు ఉన్నాయట. సెక్స్ మాత్రలను వార్న్ ఏ మోతాదులో తీసుకున్నాడో తెలియదని పోలీసు చెప్పారు. తమ దేశ దిగ్గజ క్రీడాకారుడు అత్యంత దారుణ స్థితిలో చనిపోవడం బయటకు రాకుండా ఆస్ట్రేలియా సీనియర్ అధికారులు ఇలా చేసినట్లు తెలుస్తోంది.
థాయ్‌లాండ్ కోహ్ సమూయి ద్వీపంలో వార్న్ కు విల్లా ఉంది. ఇక్కడే అతడు 2022 మార్చి 4న చనిపోయాడు. అయితే, ఈ వ్యవహారంలో తమ గోప్యతకు గౌరవం ఇవ్వాలని అతడి కుటుంబం అప్పట్లో విన్నవించింది.