సత్యసాయి జిల్లాలో దారుణం.. అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్
దసరా పండుగపూట దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా.. ప్రస్తుత సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఆరాచక ఘటన షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 13 Oct 2024 4:35 AM GMTదసరా పండుగపూట దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా.. ప్రస్తుత సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఆరాచక ఘటన షాకింగ్ గా మారింది. జిల్లాలోని చిలమత్తూరు మండలంలోని ఒక గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ చేసిన వైనం కలకలం రేపింది. పోలీసుల కథనంపై కర్ణాటక రాష్ట్రానికి చెందిన బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి కోసం చిలమత్తూరు మండలం పరిధిలోని ఒక గ్రామానికి వచ్చారు.
ఒక కన్ స్ట్రక్షన్ వద్ద వారంతా వాచ్ మెన్.. ఇతర విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు రెండు టూవీలర్ల మీద వచ్చారు. నిర్మాణం వద్ద ఉంటున్న అత్త.. కోడలను కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన తండ్రీ.. కొడుకుల్ని బెదిరించారు. ఈ ఘటన స్థానికంగ సంచలనలంగా మారింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రత్న ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుల్ని పట్టుకుంటామని హామీ ఇచచారు. ఈ ఘటన గురించి వివరాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు రియాక్టు అయ్యారు. ఎస్పీతో మాట్లాడిన ఆయన దర్యాప్తు వివరాలు సేకరించారు. దుండగుల్ని వెంటనే పట్టుకోవాలని.. కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ సైతం స్పందించారు. పోలీసులతో మాట్లాడి నిందితుల్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కోసంవచ్చిన వారిపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడటం క్షమించరాని నేరంగా పేర్కొన్నారు. పండుగ వేళ ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.