షాకింగ్ ఇష్యూ: తోడేళ్లూ ప్రతీకారం తీర్చుకుంటాయట!
అయితే.. తాజాగా యూపీలో చోటు చేసుకున్న ఘటన లు చూస్తే.. తోడేళ్లకు కూడా..ప్రతీకారం ఉంటుందనే చర్చ సాగుతోంది. యూపీలో తోడేళ్లు ఇప్పుడు మను షులను చంపేస్తున్నాయి.
By: Tupaki Desk | 5 Sep 2024 10:30 PM GMTనిజంగా ఇది షాకింగ్ విషయమే. ఎక్కడో అడవుల్లో ఉండే తోడేళ్లకు కూడా ప్రతీకారం ఉంటుందని తాజాగా వెలుగు చూసింది. వాస్తవానికి తాచు పాముల వరకు మాత్రం కొంత మేరకు కసి ఉంటుందని.. వాటికి హాని తలపెట్టిన వారిని పగబట్టి మరీ కాటు వేస్తాయని ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయం. ఇంతకు మించి.. ఇతర జంతువులు ఏవీ కూడా.. తమకు హాని తలపెట్టినా.. పగబట్టి.. ప్రతీకారం తీర్చుకున్న ఘటనలు లేవు. ఉన్నా.. ఎక్కడో ఒకటి అరా కేసులు మాత్రమే కనిపించాయి.
కర్నూలు జిల్లాలో 2022లో ఒక ఘటన వెలుగు చూసింది. తన వ్యాపార దుకాణం ముందుకు వచ్చి.. ఓ ఎద్దు యాగీ చేస్తోందన్న కారణంగా.. దుకాణ యజమాని.. ఆ ఎద్దుపై వేడి వేడి నీళ్లు కుమ్మరించాడు. దీంతో ఆ ఎద్దు తీవ్రంగా గాయపడింది. దీంతో ఎద్దు యజమానికి దానికి చికిత్స చేయించాడు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. దుకాణ దారుడు పది వేలు జరిమానా కూడా కట్టారు. అయితే.. ఆరు మాసాల తర్వాత.. మళ్లీ అక్కడకు వచ్చి.. దుకాణ యజమానిని కుమ్మి కుమ్మి చంపేసింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనంగా మారి.. జాతీయ మీడియాలోనూ ప్రొజెక్టు అయింది.
ఆ తర్వాత.. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగలేదు. అయితే.. తాజాగా యూపీలో చోటు చేసుకున్న ఘటన లు చూస్తే.. తోడేళ్లకు కూడా..ప్రతీకారం ఉంటుందనే చర్చ సాగుతోంది. యూపీలో తోడేళ్లు ఇప్పుడు మను షులను చంపేస్తున్నాయి. పగబట్టినట్టుగా ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. దీంతో ప్రజలు అల్లాడి పోతు న్నారు. విషయం ఏంటా అని ఆరా తీస్తే.. కొన్నాళ్ల కిందట.. బెహ్రైచ్ గ్రామంలో రెండు తోడేళ్ల పిల్లలు.. ట్రాక్టర్ గుద్దేసిన ప్రమా దంలో చనిపోయాయి.దీంతో అప్పటి నుంచి తోడేళ్లు ఈ గ్రామంపై దాడులు చేస్తున్నాయి.
ఎవరు కనిపించినా.. వదిలి పెట్టకుండా.. చంపుతున్నాయి. దీంతో గ్రామస్థలు హడలి పోతున్నారు. ఈ విషయం పెను సంచలనంగా మారింది. గ్రామంలోకి వస్తున్న తోడేళ్లను దూరంగా ఉన్న అడవుల్లోకి పంపించేసినా.. కూడా అవి తిరిగితిరిగి అక్కడకేవస్తున్నారు. ఈపరిణామాలపై నిపుణులు స్పందిస్తూ.. తోడేళ్లలో ప్రతీకారేచ్ఛ ఉంటుందని.. అందుకే అవి అలా చేస్తున్నాయని చెబుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.