Begin typing your search above and press return to search.

జోర్డాన్ లోని కాల్పుల్లో కేరళవాసి మరణం... తెరపైకి షాకింగ్ కారణం!

గత నెలలో ఇజ్రాయెల్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా.. జోర్డాన్ – ఇజ్రాయెల్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో థామస్ గాబ్రియెల్ మృతిచెందిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 March 2025 1:00 PM IST
జోర్డాన్ లోని కాల్పుల్లో కేరళవాసి మరణం... తెరపైకి షాకింగ్ కారణం!
X

అక్రమంగా విదేశాలకు వెళ్లడం, అక్కడ ఎన్నో ఇబ్బందులు పడానికి సంబంధించిన ఇటీవల అక్రమంగా యూఎస్ వెళ్లినవారికి సంబంధించిన వీడియోలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో గత నెలలో ఇజ్రాయెల్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు కేరళవారి థామస్ గాబ్రియెల్ (47). ఈ సమయంలో ఈయనకు సంబంధించి ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును... గత నెలలో ఇజ్రాయెల్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా.. జోర్డాన్ – ఇజ్రాయెల్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో థామస్ గాబ్రియెల్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. అతడు ఓ జాబ్ స్కామ్ బాధితుడని అంటున్నారు.

వాస్తవానికి ఆటోలు నడుపుకుంటూ వారి వారి కుటుంబాలను పోషించుకునేవారు థామస్ గాబ్రియెల్, అతడి బంధువు ఎడిసన్ ఛార్లెస్. అయితే నెలకు మూడున్నర లక్షల రూపాయల జీతం వస్తుందని ఆశ చూపించిన ఓ ఏజెంట్.. వీరిరువురిని జోర్డాన్ కు తీసుకెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరిరువురూ ఏజెంట్ కు ఇచ్చిన సొమ్ము వివరాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... భారత్ నుంచి బయలుదేరే ముందు వారు ఏజెంట్ కు రూ.2,10,000 చెల్లించారని.. ఫిబ్రవరి 10న టూరిస్ట్ వీసాపై జోర్డాన్ కు చేరుకున్న అనంతరం మరో రూ.52 వేలు ఇచ్చారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా... అక్కడ జీతాలు లేవని, బోర్డర్ దాటి ఇజ్రాయెల్ లోకి ప్రవేశిస్తే జాబ్ దొరుకుతుందని వారిని ప్రోత్సహించాడట.

దీంతో.. మరో ఆప్షన్ లేక వీరిరువురూ అక్రమంగా ఇజ్రాయేల్ లోకి ప్రవేశిస్తుండగా.. సైనికులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో థామస్ గాబ్రియెల్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతడి బంధువు ఎడిసన్ ఛార్లెస్ కు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా... జోర్డాన్ లోని భారత రాయబార కార్యాలయం నుంచి తమకు సమాచారం వచ్చిందని థామస్ కుటుంబసభ్యులు తెలిపారు.