Begin typing your search above and press return to search.

మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్... తెరపైకి షాకింగ్ విషయాలు!

ఇదే సమయంలో మస్తాన్ సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలిందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   5 Feb 2025 9:14 AM GMT
మస్తాన్  సాయి రిమాండ్  రిపోర్ట్... తెరపైకి షాకింగ్  విషయాలు!
X

లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయి ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు వెలువడ్డాయని తెలుస్తోంది. ఇదే సమయంలో మస్తాన్ సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ అని తేలిందని తెలుస్తోంది.

అవును.. రాజ్ తరుణ్ - లావణ్య కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా చెబుతున్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేయగా.. రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకొని, ఆ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో గతంలోనే మస్తాన్ సాయి, లావణ్యల మధ్య రాజ్ తరుణ్ సయోధ్య కుదిర్చాడని అంటున్నారు. ఈ సమయంలోనే మస్తాన్ సాయి లాప్ టాప్ లో ఉన్న లావణ్య వీడియోలను డిలీట్ చేయించినట్లు చెబుతున్నారు. అయితే వాటిని అప్పటికే మరో డివైజ్ లోకి మస్తాన్ సాయి కాపీ చేసేసుకున్నాడని అంటున్నారు.

ఈ క్రమంలోనే జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లి ఆమెపై హత్యాయత్నం చేశాడని చెబుతున్నారు. 2022 అక్టోబర్ లో తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించిన మస్తాన్ సాయి.. ఆ సమయంలో లావణ్య బట్టలు మార్చుకుంటున్న సమయంలో సీక్రెట్ కెమెరాతో షూట్ చేశాడని అంటున్నారు. అదే ఏడాది మరో పార్టీలో లావణ్యకు డ్రగ్స్ ఇచ్చి, మద్యం తాగించాడని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే మస్తాన్ సాయి - లావణ్య మధ్య విభేదాలు తలెత్తాయని చెబుతున్నారు. ఈ విషయాలు పోలీసులకు చెబితే.. వీడియోలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడని అంటున్నారు. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు తవ్వుకుంటూ పోతే ఎన్నో షాకింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మస్తాన్ సాయిపై పెట్టిన సెక్షన్స్ లో తాజాగా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ కూడా జోడించారని అంటున్నారు. ఇతడు అమ్మాయిల ప్రైవేటు వీడియోలు సుమారు 1 టీబీ హార్డ్ డిస్క్ లో భద్రపరుచుకోగా.. వాటిలో సుమారు 80కి పైగా నగ్న వీడియోకాల్స్, ఇతర దృశ్యాలు, ఫోటోలు గుర్తించారని తెలుస్తోంది.