Begin typing your search above and press return to search.

అనకాపల్లిలో బాలిక హత్య కేసులో బిగ్ ట్విస్ట్!

అవును... ఈ నెల 6న తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రేమోన్మాది సురేష్ గొంతు కోసి చంపాడు! అనంతరం పరారైపోయాడు.

By:  Tupaki Desk   |   11 July 2024 7:27 AM GMT
అనకాపల్లిలో బాలిక హత్య కేసులో బిగ్  ట్విస్ట్!
X

ఏపీలోని అనకాపల్లి జిల్లాలోని కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక హత్యకేసు నిందితుడు ప్రేమోన్మాది సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం శివారులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. సుమారు నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు మృతదేహం లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది.

అవును... ఈ నెల 6న తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రేమోన్మాది సురేష్ గొంతు కోసి చంపాడు! అనంతరం పరారైపోయాడు. దీంతో పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల్లు నాలుగు రోజులుగా గలిస్తున్నారు. ఇదే సమయంలో అతడి ఆచూకీ తెలిపినవారికి రూ.50 వేల నగదు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు.

సురేష్ కోసం బృందాలుగా ఏర్పడి గాలించారు. ఈ నేపథ్యంలో అతడి మృతదేహం లభ్యం అయ్యింది! తాజాగా లభ్యమైన అతడి మృతదేహం బాగా కుళ్లిన స్థితిలో ఉందని అంటున్నారు. ఇదే సమయంలో శరీరం మీద ఎటువంటి గాయాలూ లేవని.. ఎలా ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు.

కాగా... రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాధిత విద్యార్థి ఈ నెల 6వ తేదీ సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. అయితే కొద్ది సేపటి తర్వాత సురేష్.. ఆ ఇంటిలో నుండి బయటకు వస్తుండటం అమ్మమ్మ చూసింది! ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక రక్తపు మడుగులో కనిపించింది! దీంతో ఆస్పత్రికి తరలించి అనంతరం ఆమె మృతిచందినట్లు వైద్యులు తెలిపారు!

కశింకోటకు చెందిన సురేష్... కొప్పుగుండుపాలెంలోని అమ్మమ్మ ఇంటి సమీపంలో నివాసం ఉంటూ బాలికపై వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో ఏడాది క్రితం ఆమె కుటుంబ సభ్యులు అతనిపై ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టంకింద కేసు నమోదు చేశారు. అయితే... ఇటీవల బెయిల్ పై విడుదలైన సురేష్ పగ తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో బాలికపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.