Begin typing your search above and press return to search.

షాకింగ్ డెసిషన్... దుర్గం చెరువులోకి దూకి టెక్కీ ఆత్మహత్య!

వివరాల్లోకి వెళ్తే... ముషీరాబాద్ లో నివాసం ఉంటున్న పాతికేళ్ల ఓ టెక్కీ... మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   27 July 2024 12:30 PM GMT
షాకింగ్ డెసిషన్...  దుర్గం చెరువులోకి దూకి టెక్కీ ఆత్మహత్య!
X

ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత తమకు ఎదురైన చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా.. ప్రతీ సమస్యకూ చావే పరిష్కారం అనే స్థాయి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయని అంటున్నారు. వాటికి బలం చేకూరుస్తూ తాజాగా హైదరాబాద్ లో టెక్కీ దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

అవును... ఇటీవల కాలంలో చాలా మంది యువత తమకు ఎదురవుతున్న వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో సమస్యలకు చావే సరైన పరిష్కారం అనే ఆలోచనలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా హైదరాబాద్ లోని ఓ టెక్కీ (25) తన ప్రేమ విషయాన్ని తల్లితండ్రులకు చెప్పలేక, ప్రేమించిన అమ్మాయి పెళ్లికోసం చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక చేసుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది!

వివరాల్లోకి వెళ్తే... ముషీరాబాద్ లో నివాసం ఉంటున్న పాతికేళ్ల ఓ టెక్కీ... మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగానే జూలై 24 - బుధవారం కూడా ఆఫీసుకు వెళ్లాడు కానీ... తిరిగిరాలేదు. పైగా అతడి ఫోన్ స్విచ్చాఫ్ అయి ఉంది. దీంతో... అతడి ఆచూకీ కోసం అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు.

ఈ ప్రయత్నాల్లో భాగంగా సదరు టెక్కీ స్నేహితులను, సహచరులనూ ఎంక్వైరీ చేశారు.. అయితే.. అందరి నుంచీ ఒకటే సమాధానం.. "తమకు తెలియదని!". ఈ నేపథ్యంలో... చివరికి అతడి తల్లితండ్రులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో... కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా సీసీ కెమెరాల ద్వారా కదలికలను గుర్తించారు.

ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం వెలుగులో వచ్చింది. ఇందులో భాగంగా అదే రోజు (జూలై 24) రాత్రి 8:30 గంటల సమయంలో ఆఫీసు నుంచి బయలుదేరిన సదరు టెక్కీ... దుర్గం చెరువు వద్దకు వెళ్లి, అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో... శుక్రవారం సాయంత్రం దుర్గం చేరువు నుంచి అతడి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.. ఐడీ కార్డు సాయంతో అతడిని గుర్తించారు!

అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే... సదరు టెక్కీకి గత కొంతకాలంగా ఓ మహిళతో సంబంధం ఉందని.. దీంతో, ఆమె వివాహం కోసం ఇతడిపై నిరంతరం ఒత్తిడి చేస్తుందని.. అయినప్పటికీ ఇతడు తన ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో చెప్పలేకపోయాడని అంటున్నారు. ఈ ఒత్తిడే అతని ఆత్మహత్యకు కారణం అని ప్రాథమికంగా ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది!