Begin typing your search above and press return to search.

విన్నంతనే షాక్: రోడ్డు దాటుతుంటే ఢీ.. తల తెగి కారులోపలకు!

హృదయ విదారక ఉదంతం ఒకటి అవుటర్ రింగ్ రోడ్ మీద చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   7 Aug 2024 11:40 AM IST
విన్నంతనే షాక్: రోడ్డు దాటుతుంటే ఢీ.. తల తెగి కారులోపలకు!
X

హృదయ విదారక ఉదంతం ఒకటి అవుటర్ రింగ్ రోడ్ మీద చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఒక పెద్ద వయస్కుడ్ని కారు ఢీ కొట్టగా.. అతను ఎగిరి కారు అద్దంపై పడ్డాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తల కారు సీట్లోపడగా.. మొండం రోడ్డు మీద విడిపోయి పడిపోయింది. ఈ భీతావాహ ఘటన గురించి విన్న వారంతా వణికే పరిస్థితి. అవుటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన ఈ ఘటన శంషాబాద్ మున్సిపల్ పరిధి తొండుపల్లి వద్ద చోటు చేసుకుంది.

ఊటుపల్లికి చెందిన 65 ఏళ్ల అంజయ్య రోజువారీ కూలీకి వెళుతుంటాడు. సాయంత్రం వేళ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనుకోకుండా దారి తప్పి ఔటర్ మీదుగా తుక్కుగూడ వైపు నడుచుకుంటూ వెళుతున్నాడు. తొండుపల్లి కూడలి వద్ద ఔటర్ మెయిన్ రోడ్ ను దాటుతున్నాడు. ఇదే సమయంలో గచ్చిబౌలి నుంచి వేగంగా వచ్చిన కారు ఆయన్ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో అంజయ్య తల నేరుగా కారు అద్దాన్ని తాకింది. దీంతో.. అద్దం పగిలి తన అందులో ఇరుక్కుపోయింది. ప్రమాద సమయంలో కారు వేగంగా వెళుతుండటంతో మెడ కోసుకుపోయింది. దీంతో తెగిన తల లోపల సీట్లో పడిపోగా.. మొండం రోడ్డు మీద పడింది. దీంతో వాహనదారుడు వణికిపోయాడు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్నంతనే ఔటర్ పెట్రోలింగ్ గస్తీ సిబ్బంది.. శంషాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.