Begin typing your search above and press return to search.

చదువుకుంటానంటే పెళ్లి చేశారు.. చచ్చిపోయింది

గత నెల (ఏప్రిల్) 28న ఆమెకు పెళ్లి చేశారు. అయిష్టంగానే పెళ్లి చేసుకున్న దేవకి.. తాను చదువుకు దూరమవుతానని వేదన చెందింది.

By:  Tupaki Desk   |   23 April 2024 8:30 AM
చదువుకుంటానంటే పెళ్లి చేశారు.. చచ్చిపోయింది
X

అయ్యో.. పాపం అనిపించే ఉదంతమిది. ఈ రోజుల్లో కూడా పెళ్లి కోసం ఇంత పట్టుబట్టే తల్లిదండ్రులు ఉంటారా? అది కూడా మధ్యతరగతి ఇంట్లో అనిపించే ఈ విషాదంలోకి వెళితే.. చదువుల మీద మక్కువతో ప్రాణాల్ని తీసుకున్న ఈ చదువుల తల్లి గురించి తెలిస్తే కంట కన్నీరు ఖాయం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్య బంజర్ గ్రామానికి చెందిన శ్రీను.. పద్మ దంపతులకు కూతురు.. ఒక కుమారుడు. కుమార్తె పేరు దేవకి. ఇటీవల బీఎస్సీ పూర్తి చేసింది. తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు. బీఎస్సీ పూర్తైన వేళ.. ఉన్నత చదువుల కోసం పట్టుబట్టింది. తాను చదువుకుంటానని తల్లికి చెబితే.. ఆమె మాత్రం పెళ్లి చేసుకోవాలని కోరింది. తనకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదని.. వెంటనే పెళ్లి చేసుకోవాలని కోరగా.. దేవకి ఒప్పుకోలేదు. దీంతో.. ఆమెకు నచ్చజెప్పి.. ఒప్పించి.. పెళ్లి చేశారు.

గత నెల 28న ఆమెకు పెళ్లి చేశారు. అయిష్టంగానే పెళ్లి చేసుకున్న దేవకి.. తాను చదువుకు దూరమవుతానని వేదన చెందింది. పదహారు రోజుల పండగ కోసం పుట్టింటికి వచ్చింది. ఈ నెల 14న రాత్రి ఇంట్లో వారంతా నిద్ర పోతున్న వేళలో పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తీసుకెళ్లారు. అప్పటి నుంచ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఆమె.. సోమవారం తెల్లవారుజామున మరణించింది. చదువు మీద ఉన్నఆసక్తితో.. పెళ్లితో తాను కోరుకున్నది జరగదన్న వేదనతో మరణించిన దేవకి ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో అనకుండా ఉండలేకపోతున్నారు.