చనిపోయిన వారికి పెళ్లా?
మనదేశంలో వింతైన ఆచారాలు, గమ్మత్తైన సంప్రదాయాలు ఉండటం సహజమే.
By: Tupaki Desk | 14 May 2024 5:30 PM GMTమనదేశంలో వింతైన ఆచారాలు, గమ్మత్తైన సంప్రదాయాలు ఉండటం సహజమే. ఒక కులంలో ఒక్కో ఆచారం ఉంటుంది. అది తెలిస్తే మనకు ఆశ్చర్యం వేయక మానదు. కానీ ఇక్కడ మాత్రం ప్రేతాత్మలకు పెళ్లి చేయడం ఓ ఆచారమే. దీంతో అక్కడి వారు తమ కుటుంబంలో చనిపోయిన వారికి తగిన వారిని చూసి వివాహ తంతు జరిపించి మురుస్తారట. అదేంటో చూద్దాం.
కర్ణాటకలోని పుత్తూరులో 30 సంవత్సరాల క్రితం చనిపోయిన ఓ ఆడపిల్లకు వరుడు కావాలని ప్రకటించారు. వధువు 30 సంవత్సరాల క్రితం మరణించిందని ఆమెకు తగిన పురుషుడు కావాలని కోరారు. బంగే రా గోత్రం, కులల్ కులంలో పుట్టిన వరుడు కావాలన్నారు. వేరే గోత్రమైనా ఫర్వాలేదు. 30 ఏళ్ల క్రితం మరణించి ఉంటే చాలని తెలిపారు.
దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో ఇలా మరణించిన వారికి పెళ్లిళ్లు చేయడం ఆనవాయితీ. మరణించిన వారి ఆత్మలకు పెళ్లి చేసే ఆచారం ఎప్పటి నుంచో ఉందట. ప్రేత మడునే అని పిలుచుకునే ఈ ఆచారంలో పెళ్లి తరహాలోనే కార్యక్రమం పూర్తి చేస్తారట. ఈ పెళ్లికి వరుడి కుటుంబ సభ్యులు అంగీకరిస్తే ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.
ప్రేతాత్మలతో జరిగే వివాహ వేడుకను చూడటానికి చాలా మంది వస్తారట. వివాహ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. చనిపోయిన వారి ఆత్మలతో పెళ్లి చేయడం కొత్తగానే ఉంది. కానీ ఇది వారికి పాతదే. ఇలా మనదేశంలో చాలా ప్రాంతాల్లో చాలా ఆచారాలు వింత, విశేషాలు కలిగి ఉండటం సహజమే.అందుకే మనదేశం విభిన్న జాతులున్న భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా కీర్తించబడుతోంది.
ఉత్తరాదిలో ఇంకా వారి ఆచారాలు గమ్మత్తుగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. మదేశంలో విభిన్న జాతులు, మతాలు, కులాల కలయికతో మన ఆచార వ్యవహారాలు ఎంతో విభిన్నంగా ఉండటంలో తప్పు లేదు.