అమెరికా హైస్కూల్లో కాల్పులు.. నలుగురు మృత్యువాత
జార్జియాలోని ఒక ఉన్నత పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.
By: Tupaki Desk | 5 Sep 2024 4:35 AM GMTగన్ కల్చర్ అమెరికాలోని అమాయకుల ప్రాణాల్ని తీసేస్తుంది. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. గన్ కల్చర్ కు కంట్రోల్ వేయాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తున్నా.. ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఏవీ సిద్ధంగా లేని పరిస్థితి. ఇదంతా ఎందుకుంటే.. అమెరికాలోని జార్జియా బారో కౌంటీలోని ఒక హైస్కూల్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ముగ్గురు మరణించగా.. పలువురు గాయపడినట్లుగా చెబుతున్నారు.
జార్జియాలోని ఒక ఉన్నత పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి.. ఈ ఉదంతంపై లోతైన విచారణ చేపట్టాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు.. కాల్పులు జరిగిన స్కూల్ మొత్తాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
అనంతరం స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని తమతో పాటు ఫుట్ బాల్ స్టేడియంకు తీసుకెళ్లి.. అక్కడ ఉంచారు. ఈ సందర్భంగా కాల్పులకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. కాల్పులు జరిగిన స్కూల్ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు.
ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో (సరిగ్గా అయితే 10.23 గంటలు) స్కూల్లోకాల్పుల ఉదంతం గురించి సమాచారం అందిందని.. వెంటనే తమ సిబ్బందిని పంపినట్లుగా బారో కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా పరిస్థితిపై దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆరా తీశారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది. మరోసారి స్వేచ్ఛాయుత గన్ కల్చర్ మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైందని చెప్పాలి.