Begin typing your search above and press return to search.

ఇదేం సైకో పనిరా బాబు.. 18 వీధి కుక్కలపై గన్ తో కాల్చేశారు

అర్థరాత్రి వేళ కారులో గ్రామంలోకి కారులో వచ్చిన కొందరు వీధి కుక్కల్ని వెంబడించి.. వెంటాడి మరీ కాల్పులు జరిపారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 10:30 AM GMT
ఇదేం సైకో పనిరా బాబు.. 18 వీధి కుక్కలపై గన్ తో కాల్చేశారు
X

షాకింగ్ ఉదంతానికి మహబూబ్ నగర్ జిల్లా వేదికైంది. కట్టలు తెగిన కోపం అనాలో.. కసి అనాలో కానీ.. వీధికుక్కల్ని గన్ తో కాల్చేసిన చంపేసిన వైనం విస్మయానికి గురి చేస్తోంది. ఎందుకిలా? చేశారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వీధి కుక్కల్ని వెంటాడి మరీ గన్ తో కాలుస్తూ పద్దెనిమిది మూగజీవాల్ని పొట్టనపెట్టుకున్న ఉదంతం సంచలనమైంది. ఎవరు చేశారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. పథకం ప్రకారం వీధికుక్కల్ని కాల్చేసినట్లుగా చెబుతున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని పొన్నకల్ గ్రామంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ కారులో గ్రామంలోకి కారులో వచ్చిన కొందరు వీధి కుక్కల్ని వెంబడించి.. వెంటాడి మరీ కాల్పులు జరిపారు.అరగంట పాటు వీరి బీభత్సానికి పద్దెనిమిది కుక్కలు ప్రాణాలు విడిచాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. గురువారం అర్థరాత్రి 1.25 గంటల వేళలో కారులోని నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. వారంతా ముసుగులు ధరించారు. లోకల్ మేడ్ గన్స్ తో వచ్చిన వారు.. కనిపించిన కుక్కలపై తూటాల వర్షం కురిపించారు.

కుక్కల అరుపులు.. గన్ శబ్ధాలతో బయటకు వచ్చిన గ్రామస్తులు వీరి బీభత్సకాండతో హడలిపోయి ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకన్నారు. కొందరు ఇళ్లపైకి ఎక్కి చూశారు. అర్థరాత్రి 2.08 గంటల వేళకు తాము అనుకున్న పనిని పూర్తి చేసుకున్న వారు తాపీగా వెళ్లిపోయారు. ఈ గుర్తు తెలియని వ్యక్తులు బ్రిజా కారులో వచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు సమాచారం అందించటంతో వారు పశుసంవర్ధక వాఖ అధికారులను తీసుకొని గ్రామానికి వచ్చారు. శాంపిళ్లను సేకరించి హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. కంట్రీమేడ్ గన్స్ తో ఈ పని చేసి ఉంటారని చెబుతున్నారు. ఇంత హింసాత్మకంగా కుక్కల్ని ఎందుకు చంపారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.