Begin typing your search above and press return to search.

ధావన్‌ దంపతులకు విడాకులు... కారణం ఇదే!

అవును... శిఖర్‌ ధావన్‌ - అయేషా ముఖర్జీలకు కోర్టు తాజగా విడాకులు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   5 Oct 2023 4:49 AM GMT
ధావన్‌ దంపతులకు విడాకులు... కారణం ఇదే!
X

భారత క్రికెటర్‌, డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. విచారణ సందర్భంగా శిఖర్‌ ధావన్‌, అతడి మాజీ భార్య అయేషా ముఖర్జీ ల వాదనలు విన్న న్యాయమూర్తి... ధావన్‌ చేసిన ఆరోపణలు అన్నీ నిజమైనవని విశ్వసించారని తెలుస్తుంది. ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా వేధించిందన్న ధావన్‌ వ్యాఖ్యను కోర్టు సమర్థించింది.

అవును... శిఖర్‌ ధావన్‌ - అయేషా ముఖర్జీలకు కోర్టు తాజగా విడాకులు ఇచ్చింది. ఈ సమయంలో ఒక్కగానొక్క కొడుకుతో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని ఆయేషా ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇదే సమయంలో ధావన్ - ఆయేషా దంపతుల కుమారుడిని శాశ్వత కస్టడీకి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

అయితే ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడు జోరావర్‌ ను చూసేందుకు మాత్రం ధావన్‌ కు కోర్టు అనుమతించింది. ఇదే సమయంలో... స్కూలు సెలవుల్లో ధావన్‌ తో పాటు అతడి కుటుంబ సభ్యులను కలిసేందుకు వారి కుమారుడిని భారత్‌ కు తీసుకురావాలని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా... వీడియో కాల్‌ ద్వారా కూడా ధావన్‌ తన కుమారుడితో టచ్‌ లో ఉండొచ్చని పేర్కొంది.

వాస్తవానికి వివాహ సమయంలో ధావన్‌ విజ్ఞప్తి మేరకు అతడితో భారత్‌ లో నివసించేందుకు అయేషా అంగీకరించింది. అయితే ఆమెకు మొదటి భర్త కారణంగా కలిగిన ఇద్దరు కుమార్తెల కారణంగా ఆ మాటను నిలబెట్టుకోలేకపోయింది. దీంతో వీరిద్దరికీ కలిగిన కుమారుడు జోరావర్‌ ను ఆస్ట్రేలియాలోనే పెంచింది అయేషా.

దీంతో... ధావన్‌.. అతడి కుమారుడితో అతన్ని కొన్నేళ్ల పాటు దూరంగా ఉంచి అయేశా మానసిక వేదనకు గురి చేసిందని కోర్టు అభిప్రాయపడింది. ఇదే సమయంలో ధావన్‌ తన సొంత డబ్బులో కొనుగోలు చేసిన ఆస్తులలో 99శాతం తన పేరిట రాయాలని అయేషా ఒత్తిడి చేసింది. మిగిలిన ఆస్తుల్లో ఉమ్మడి యజమానిగా తనను ఉంచాలని కోరినట్లు కోర్టు విశ్వసించింది.

ఆస్ట్రేలియాలో ఉన్న కుమార్తెల స్కూలు ఫీజుల కోసం నెలకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పంపమని అయేషా ఒత్తిడి చేసినట్లు ధావన్‌ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఇదే సమయంలో ఈ ఆరోపణలకు అయేషా నుంచి ప్రతిస్పందన రాలేదని తెలుస్తుంది. దీంతో... వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. శిఖర్ ధావన్ - అయేషా లకు విడాకులు మంజూరు చేసింది.

కాగా... 2012 అక్టోబర్‌ లో ధావన్‌ - అయేషాలు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికే ఆమెకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దీంతో... అయేషా తో పాటు వారిని కూడా శిఖర్ స్వీకరించాడు. ఈ క్రమంలో ధావన్, అయేషా ముఖర్జీకి 2014లో జోరావర్ పుట్టాడు. అయితే... గత కొంతకాలంగా విడిగా ఉంటున్న వీరద్దరికీ తాజాగా కోర్టు విడాకులు మంజూరు చేసింది.