సౌండ్ చేస్తున్న ఓటు కంటే సైలెంట్ ఓటే డిసైడింగ్ ఫ్యాక్టరా !?
గొంతుక ఉన్న వారు సమాజంలో ఉన్నారు. వారు ఒకటికి పదిసార్లు తమ భావాలను బిగ్గరగా గొంతు విప్పి చెబుతారు.
By: Tupaki Desk | 27 May 2024 2:30 PM GMTగొంతుక ఉన్న వారు సమాజంలో ఉన్నారు. వారు ఒకటికి పదిసార్లు తమ భావాలను బిగ్గరగా గొంతు విప్పి చెబుతారు. వారికి మధ్యమాలు కూడా సహకరిస్తాయి. మరి గొంతు లేని వారి భావన ఏమిటి అది ఏమి చెబుతోంది అంటే అక్కడే టెన్షన్ ఎవరికైనా స్టార్ట్ అయ్యేది.
ఎపుడూ కూడా సౌండ్ చేసే ఓటు వల్ల అధికారం దక్కిన సూచనలు లేవు. సైలెంట్ ఓటింగే ఎవరికైనా పవర్ ని అప్పగించేది. అలా చూస్తే ఏపీలో సౌండ్ ఓట్లు ఎన్ని సైలెంట్ ఓట్లు ఎన్ని అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. పోలింగ్ కి ముందూ తరువాత కూడా సౌండ్ చేస్తున్న ఓటింగ్ అంతా వైసీపీ వ్యతిరేక ఓటేనని అంటున్నారు.
ఆ ఓట్లను చూసి అధికారంలో ఉన్న వైసీపీ ఓటమి పాలు అవుతుందని అనుకుంటే పొరపాటు అని అంటున్నారు. నిజానికి ఓకల్ సెక్షన్లలో అధిక శాతం వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఆ పార్టీ అంగీకరిస్తోంది. వీరంతా
అర్బన్ లో ఉంటారని వీరి మీద రకరకాలైన ప్రభావాలు అధికం అని అంటున్నారు.
ఇక అర్బన్ ఓటర్లలోనే ఉద్యోగులు విద్యావంతులు నిరుద్యోగులు సహా కీలక వర్గాలు అన్నీ ఉన్నాయని అంటున్నారు. వీరిలో ఎక్కువ భాగం ఓట్లు కూటమి పడతాయని కూడా అంగీకరిస్తున్నారు. అయితే వైసీపీకి ఉన్న నమ్మకం అంతా రూరల్ ఓటింగ్ మీదనే. వీరంతా గొంతు లేని వారు సైలెంట్ ఓటర్లు అని అంటున్నారు. వీరిని ఏ మీడియా పరిగణనలోకి తీసుకోదని అంటున్నారు.
కానీ వారే ఎవరి రాజకీయ జాతకాన్ని అయినా కీలకమైన మలుపు తిప్పగలిగే సత్తా గలిగిన వారు అని అంటున్నారు. ఏపీలో మొత్తం నాలుగు కోట్ల 14 లక్షలకు పైగా ఓటర్లు ఉంటే ఇందులో అత్యధిక శాతం మూడు కోట్లకు పైగా పల్లె జనాలే ఉన్నారని వైసీపీ లెక్క చెబుతోంది. అలాగే మహిళా ఓటింగ్ కూడా ఏపీలో ఎక్కువ అని. అది ఈసారి బాగా జరిగింది అని గుర్తు చేస్తోంది.
సైలెంట్ ఓటింగ్ అన్నది 2019లో వైసీపీ ప్రభంజనానికి దారి తీసిందని ఈసారి కూడా అదే జరిగి తీరుతుందని ఆ పార్టీ నమ్మకం వ్యక్తం చేస్తోంది. అర్బన్ ఓటింగ్ ఎంత బాగా జరిగినా దాని పరిమితులు దానికి ఉన్నాయని కూడా చెబుతోంది. దాంతో ఓటర్ల విషయంలో ఎవరికీ అందరి విశ్లేషణలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ విషయాన్ని విస్మరించి తామే గెలుస్తామని కూటమి అంటోందని చెబుతున్నారు. మాట్లాడేవారు అంతా వైసీపీ ఓటమి పాలు అవుతుందని అంటే దానిని మైండ్ గేం గా మారుస్తోంది టీడీపీ కూటమి అని అంటున్నారు. ఏది ఏమైనా తమకు పాజిటివ్ ఓటింగ్ ఈసారి జరిగిందని అది సైలెంట్ ఓటింగ్ అని వారు చెబుతున్నారు మాట్లాడని గొంతుకలే తమకు బలం బలగం అని వైసీపె పూర్తి నమ్మకంతో ఉంది.
మరి వైసీపీ నమ్మకం ప్రకారం సైలెంట్ ఓటింగే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే అధికారం తిరిగి ఫ్యాన్ పార్టీ సొంతం అవుతుంది. కానీ ఆ మాట్లాడని వారు సైతం యాంటీగా ఓటు చేసే అపుడు కధ కంప్లీట్ గా రివర్స్ అవుతుంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.