Begin typing your search above and press return to search.

ఇంట్రస్టింగ్... ఇకపై వేసుకున్న బట్టలే ఛార్జింగ్ పాయింట్లు!

అవును... స్వీడన్ లోని చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలోని ఒక పరిశోధనా బృందం.. ఒక వాహక ప్లాస్టిక్ పదార్ధంతో పూసిన సాధారణ పట్టు దారాన్ని తయారుచేసింది.

By:  Tupaki Desk   |   5 Nov 2024 9:30 AM GMT
ఇంట్రస్టింగ్... ఇకపై వేసుకున్న  బట్టలే ఛార్జింగ్  పాయింట్లు!
X


సాధారణంగా విద్యుత్ ను వేటి నుంచి ఉత్పత్తి చేస్తారనేది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. గాలి, నీరు, సూర్యరశ్మి, బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు! అయితే.. ఇకపై వేసుకున్న దుస్తులకు యూఎస్బీ కనెక్ట్ చేసుకుని పోర్టబుల్ పరికరాలకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని.. అలాంటి దారాన్ని క్రియేట్ చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.






అవును... స్వీడన్ లోని చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలోని ఒక పరిశోధనా బృందం.. ఒక వాహక ప్లాస్టిక్ పదార్ధంతో పూసిన సాధారణ పట్టు దారాన్ని తయారుచేసింది. ఇది దుస్తులను విద్యుత్ జనరేటర్లుగా మార్చడానికి సహాయపడతాయి. ఫలితంగా మొబైల్ ను ఛార్జ్ చేయడానికి, హెల్త్ ని పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది.







అయితే ధరించే దుస్తులు శరీరానికి అతుక్కుని ఉంటాయి కాబట్టి.. వాటిలో ఉపయోగించే పదార్ధాల భద్రత విషయంలో శాస్త్రవేత్తలు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు పరీక్షించిన పట్టు దారంలో కండక్టింగ్ పాలిమర్ తో చేసిన పూత ఉంతుంది. ఇది రసాయన నిర్మాణంతో కూడిన ప్లాస్టిక్ పదార్ధం. ఇది విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది!







ఈ విషయాలపై స్పందించిన చామర్స్ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ లో డాక్టరల్ విద్యార్థి మారియావిట్టోరియా క్రెయిఘెర్... తాము ఉపయోగించే పాలిమర్లు తేలికైనవి, వంగగలిగేవి అని వెల్లడించారు. ఇదే సమయంలో అవి ద్రవ, ఘన రూపాల్లో ఉపయోగించడానికి సులువైనవని తెలిపారు.



ఈ నేపథ్యంలో... ఈ కొత్త థ్రెడ్ ను ఆచరణలో ఎలా ఉపయోగించొచ్చో చూపించడానికి, పరిశోధకులు రెండు థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ లను తయారుచేశారు. ఈ సమయంలో... ఏడు వాష్ ల తర్వాత, థ్రెడ్ దాని వాహక లక్షణాల్లో ముండింట రెండు వంతులని నిలుపుకుందని.. ఇది చాలా మంది ఫలితమని మారియావిట్టోరియా వెప్పారు.



ఈ సందర్భంగా స్పందించిన చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ క్రిస్టియన్ ముల్లర్... థర్మో ఎలక్ట్రిక్ టెక్స్ టైల్స్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని.. తమ ఈ పరిశోధన సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని.. ఇదొక ముఖ్యమైన ముందడుగని తెలిపారు.