Begin typing your search above and press return to search.

అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా సైమన్ హారిస్!

సాధారణంగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక దేశానికి ప్రధాని స్థాయి వ్యక్తిగా ఎదగాలంటే సుమారు 30 ఏళ్లకు పైగా రాణించాలని చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   10 April 2024 4:04 AM GMT
అత్యంత పిన్న వయస్కుడైన  ప్రధానిగా సైమన్  హారిస్!
X

సాధారణంగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక దేశానికి ప్రధాని స్థాయి వ్యక్తిగా ఎదగాలంటే సుమారు 30 ఏళ్లకు పైగా రాణించాలని చెబుతుంటారు. అయితే... 37 ఏళ్ల వయసులోనే ఒక దేశానికి ప్రధాని అయిపోయాడు హారిస్. దీంతో... అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డ్ నెలకొల్పాడు. ఆ విశేషలేమిటో ఇప్పుడు చూద్దాం..!

అవును... ఐర్లాండ్ శాసన సభ్యుడు సైమన్ హారిస్ మంగళవారం హౌస్ లో ఓటింగ్ ద్వారా ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. బహిరంగంగా స్వలింగ సంపర్కులు, భారతీయ సంతతికి చెందిన లియో వరద్కర్ గత నెలలో ఆకస్మిక రాజీనామాను ప్రకటించిన తర్వాత దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా హారిస్ ఎన్నికయ్యారు.

ఈ క్రమంలో... హారిస్ ఇప్పుడు సెంటర్ రైట్ ఫైన్ గేల్ పార్టీ నేతృత్వంలోని మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి అధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న హారీస్... వరద్కర్ కు వారసుడిగా తెరపైకి వచ్చిన ఏకైక అభ్యర్థి కావడం గమనార్హం. అంతక ముందు మార్చి 20న వరద్కర్ తన వ్యక్తిగత, రాజకీయ కారణాలతో రాజీనామాను ప్రకటించారు.

తాజాగా డబ్లిన్‌ లోని అధ్యక్షుడి అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు మైఖేల్ డి హిగ్గిన్స్... హారిస్‌ ను అధికారికంగా ప్రధానిగా నియమించారు. ఐర్లాండ్ పార్లమెంట్ దిగువ సభలోని సభ్యులు 88-69 ఓట్ల తేడాతో హారిస్‌ ను ప్రధానమంత్రిగా ధృవీకరించారు. ఈ సమయంలో... ఆరోగ్య సేవ, విపరీతంగా పెరుగుతున్న ఇంటి ఖర్చులు, ఫైన్ గేల్ చట్టసభ సభ్యుల వలసలతో సహా పలు కీలక సవాళ్లను ఎదుర్కొంటున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన హారిస్... తనపై ఉంచిన నమ్మకాన్ని గౌరవించడానికి తాను చేయగలిగినంతా చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కొత్త ఆలోచనలు, కొత్త శక్తిని ప్రజా జీవితంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా... మొట్టమొదటిసారిగా 24ఏళ్ల వయసులోనే హారీస్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు.