Begin typing your search above and press return to search.

భార్య కారులో గంజాయి పెట్టి (మాజీ) భర్త భారీ ప్లాన్.. ట్విస్ట్ ఏంటంటే...?

అవును... సింగపూర్ లో జియాల్ లాంగ్ (37) అనే వ్యక్తి తన భార్యను మాదకద్రవ్యాల కేసులో ఇరికించి ఏకంగా మరణశిక్ష పడేలా చేయాలని ప్లాన్ చేశాడు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 7:30 PM GMT
భార్య కారులో గంజాయి పెట్టి (మాజీ) భర్త భారీ ప్లాన్.. ట్విస్ట్  ఏంటంటే...?
X

కొంతమంది తెలివితేటలు తమకు మాత్రమే ఉన్నాయని భావిస్తుంటుంటారు.. తాము గానీ స్కెచ్ గానీ వేశామంటే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.. తర్వాత కాలం గాలం వేసేసరికి మేటర్ మొత్తం రివర్స్ అయిపోతుంటుంది.. తర్వాత లబోదిబోమన్నా జాలి చూపించేవారు కూడా దొరకని పరిస్థితి ఎదురవుతుంటుంది. తాజాగా సింగపూర్ లో ఓ వ్యక్తి పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉందనే ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... సింగపూర్ లో జియాల్ లాంగ్ (37) అనే వ్యక్తి తన భార్యను మాదకద్రవ్యాల కేసులో ఇరికించి ఏకంగా మరణశిక్ష పడేలా చేయాలని ప్లాన్ చేశాడు. దీంతో... తన భార్య కారు వెనుక సీటు మధ్యలో అర కిలో కంటే ఎక్కువ మొత్తంలో గంజాయిని పెట్టాడు. మాదకద్రవ్యాల రవాణా కేసులో ఆమెకు మరణశిక్ష పడటానికి ఈ మొత్తం సరిపోతుందని భావించాడు.

కారణం... ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మాదకద్రవ్యాల వ్యతిరేక చట్టాలు సింగపూర్ లో ఉన్నాయి. అయితే అతడి ప్లాన్ సగం సక్సెస్ అయ్యింది.. కానీ, ఫలితం మాత్రం బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఫలితంగా అతడికే కోర్టు మూడు సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో తప్పుడు సాక్ష్యాలను సృష్టించే ప్రయత్నం చేశాడనే అభియోగాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది.

ఈ వ్యవహారం రివర్స్ ఎలా అయ్యిందంటే...?:

జియంగ్ లాంగ్, ఆయన భార్య 2021లో వివాహం చేసుకున్నారు. అయితే వీరి కాపురం ఏడాదికే దెబ్బతినింది! ఫలితంగా వీరు విడిపోయారు. అయితే... సింగపూర్ లో పెళ్లై కనీసం మూడేళ్లు అయిన జంటలకు మాత్రమే విడాకులు మంజూరు చేస్తారు. దీంతో... వీరిద్దరూ విడాకుల కోసం ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. ఆ మూడేళ్ల సమయం పూర్తవ్వడం కోసం చూస్తున్నారంట!

అయితే... దంపతుల్లో ఒకరికి క్రిమినల్ రికార్డ్ ఉంటే మాత్రం ఆ మూడేళ్ల రూల్ ని మినహాయిస్తారు. ఫలితంగా... విడాకులకు ఎప్పుడైనా దరఖాస్తుచేసుకోవచ్చు. దీంతో... ఇతడు సుమారు 500 గ్రాములకంటే ఎక్కువ గంజాయిని కొని.. మరుసటి రోజు ఆమె కారులో దాచిపెట్టాడు. అయితే.. ఈ హడావిడిలోనో, ఆనందంలోనో... తన భార్య కారులో కెమెరా ఉందనే విషయాన్ని పట్టించుకోలేదు.

ఇలా ఇతడు గంజాయి పెట్టడానికి కారు డోర్ ఓపెన్ చెయగానే.. కెమెరా నుంచి ఆమె ఫోన్ కు నోటిఫికేషన్ వచ్చిందంట. ఈ సమయంలో ఆమె లైవ్ ఫుటేజిని చెక్ చేయగా... తన నుంచి విడిపోయిన భర్త కారు చుట్టూ తిరగడం చూసి, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో అతడిని పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా తన ప్లాన్ సక్సెస్ అయితే.. ఆమెను అరెస్ట్ చేస్తారని.. ఆమెపై తీవ్ర నేరారోపణలు చేస్తారని భావించానని కోర్టు పత్రాల్లో పేర్కొన్నాడని తెలుస్తోంది. వాస్తవానికి ఇతడికి ఐదేళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నప్పటికీ... విచారణకు సహకరించి, ప్రారంభంలోనే నేరాన్ని అంగీకరించినందుకు శిక్షను 3 ఏళ్ల 10 నెలలకు తగ్గించారు!